Telugu Global
NEWS

టీడీపీలో రెండో వికెట్ పై బీజేపీ గురి.... ఇక చేరికే....

వచ్చే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ అందుకు నేతల వలసలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి డీకే అరుణ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డిలను చేర్చుకున్న టీఆర్ఎస్ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీ సీట్లను గెలుచుకొని తెలంగాణలో సత్తా చాటింది. అదే ఊపులో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ను లేకుండా చేయాలని […]

టీడీపీలో రెండో వికెట్ పై బీజేపీ గురి.... ఇక చేరికే....
X

వచ్చే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ అందుకు నేతల వలసలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యింది.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి డీకే అరుణ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డిలను చేర్చుకున్న టీఆర్ఎస్ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీ సీట్లను గెలుచుకొని తెలంగాణలో సత్తా చాటింది. అదే ఊపులో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ను లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అందుకే సీఎల్పీని విలీనం చేసుకుంది. ఇక బీజేపీ నేతలు ఎవరు టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు లేవు. కాంగ్రెస్ బలహీనపడితే బలపడాలని బీజేపీ చూస్తోంది.

ఇందుకోసం తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలను లాగేయాలని బీజేపీ స్కెచ్ గీసింది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డిలు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు.

ప్పుడు తెలంగాణలో టీడీపీకి పెద్దదిక్కు.. బాబు తర్వాత నంబర్ 2గా టీడీపీలో వెలుగొందిన దేవేందర్ గౌడ్ తో బీజేపీ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. వీరే కాదు.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీలో ఇప్పటికే టీఆర్ఎస్ దెబ్బకు టీడీపీ ఢీలా పడిపోయింది. కోలుకునే పరిస్థితి లేదు. అందుకే ఆ పార్టీలో మిగిలిన బలమైన నేతలను లాగి తెలంగాణలో బలపడాలని బీజేపీ స్కెచ్ గీసింది. మరి టీడీపీ నేతలు బీజేపీలో చేరితే మాత్రం ఆ పార్టీ బలపడడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  9 Jun 2019 12:43 PM IST
Next Story