Telugu Global
National

నేడు తిరుమలకు ప్రధాని.... స్వాగతం పలకనున్న ఏపీ సీఎం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం తిరుమల రానున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకోనున్నారు. అధికారిక పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ […]

నేడు తిరుమలకు ప్రధాని.... స్వాగతం పలకనున్న ఏపీ సీఎం..!
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం తిరుమల రానున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకోనున్నారు.

అధికారిక పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ విడివిడిగా రోడ్డు మార్గాన తిరుమలకు పయనమవుతారు.

సాయంత్రం 5:30 నుంచి ఏడున్నర గంటల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలోనే ఉంటారు. దైవ దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని, ముఖ్యమంత్రి చేరుకుంటారు.

అక్కడి నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడ్కోలు పలుకుతారు.

ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలోనే రాత్రి బస చేసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సమావేశం అనంతరం తిరుపతి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా సచివాలయానికి వెళ్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  9 Jun 2019 3:10 AM IST
Next Story