ఫ్రెంచ్ ఓపెన్ లో నేడే టైటిల్ ఫైట్
నడాల్ ను ఊరిస్తున్న 12వ ఫ్రెంచ్ టైటిల్ తొలిసారిగా ఫైనల్లో డోమనిక్ థైమ్ సెమీస్ లోనే జోకోవిచ్, ఫెదరర్ ప్యాకప్ 2019 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ కు రంగం సిద్ధమయ్యింది. పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో రెండో సీడ్ రాఫెల్ నడాల్ తో నాలుగో సీడ్ డోమనిక్ థైమ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. 12వ టైటిల్ కు నడాల్ తహతహ…. ఫ్రెంచ్ ఓపెన్ […]
- నడాల్ ను ఊరిస్తున్న 12వ ఫ్రెంచ్ టైటిల్
- తొలిసారిగా ఫైనల్లో డోమనిక్ థైమ్
- సెమీస్ లోనే జోకోవిచ్, ఫెదరర్ ప్యాకప్
2019 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ కు రంగం సిద్ధమయ్యింది. పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో రెండో సీడ్ రాఫెల్ నడాల్ తో నాలుగో సీడ్ డోమనిక్ థైమ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
12వ టైటిల్ కు నడాల్ తహతహ….
ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే అత్యధికంగా 11 టైటిల్స్ నెగ్గి…12సార్లు ఫైనల్స్ చేరిన ఒకే ఒక్క ఆటగాడు , స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ రికార్డుస్థాయిలో 12వ టైటిల్ కు గురిపెట్టాడు.
సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ను వరుస సెట్లలో చిత్తు చేసిన నడాల్…టైటిల్ సమరంలో హాట్ ఫేవరెట్ గా బరిలోకిదిగనున్నాడు.
2004 నుంచి నడాల్ జోరు…
నడాల్ కు గతంలో 2005 నుంచి 2008 వరకు… వరుసగా నాలుగుసార్లు , తిరిగి…2010 నుంచి 2014 వరకు వరుసగా ఐదు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెల్చుకున్న అసాధారణ రికార్డు ఉంది. 2014 తర్వాత నడాల్ రెండేళ్ల విరామం లోనే తిరిగి రెండుసార్లు టైటిల్ అందుకోడం ద్వారా.. తన ఫ్రెంచ్ టైటిళ్ల సంఖ్యను 11క పెంచుకోగలిగాడు.
ఆస్ట్రియా సంచలనం డోమనిక్ థైమ్..
మరోవైపు…ఆస్ట్రియా ఆటగాడు డోమనిక్ థైమ్…అందరి అంచనాలు తలకిందులు చేసి…తన కెరియర్ లో తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు.
గత నాలుగేళ్లుగా…ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరుతూ వచ్చిన 4వ సీడ్ థైమ్… క్వార్టర్ ఫైనల్లో …రష్యన్ ప్లేయర్ కారెన్ కచనోవ్ ను 6-2, 6-4, 6-2తో చిత్తు చేసినా…సెమీఫైనల్లో మాత్రం…టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్ తో తుదివరకూ పోరాడక తప్పలేదు.
నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో థైమ్ ఐదుసెట్ల లో జోకోవిచ్ పై సంచలన విజయం సాధించాడు. జోకోవిచ్ ప్రత్యర్థిగా
ప్రస్తుత సెమీస్ కు ముందు వరకూ 2 విజయాలు, 6 పరాజయాల రికార్డు మాత్రమే ఉన్న థైమ్ …ప్రస్తుత సెమీస్ విజయంతో..
3-6తో మెరుగుపరచుకోగలిగాడు.
విజేతకు 18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ…
సూపర్ సండే టైటిల్ ఫైట్ లో విజేతగా నిలిచిన ఆటగాడికి ట్రోఫీతో పాటు 18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందచేస్తారు. ఇప్పటికే 11సార్లు ఫ్రెంచ్ టైటిల్ నెగ్గిన అపారఅనుభవం ఉన్న నడాల్ మరోసారి హాట్ ఫేవరెట్ గా టైటిల్ బరిలోకి దిగుతున్నాడు.
ఒకవేళ ఫైనల్లో డోమనిక్ థైమ్ విజేతగా నిలిస్తే…అదో సంచలనమే అవుతుంది.