మళ్ళీ తెరమీదకు వచ్చారు....
చంద్రబాబుకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మైకుల ముందుకు వచ్చి ఆయనను ఆదుకునే సీపీఐ నారాయణ, జయప్రకాష్ నారాయణ మళ్ళీ తెరమీదకు వచ్చారు. సీపీఐ నారాయణ అయితే ఏమాత్రం సిగ్గుపడకుండా గతంలో తను ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌కు క్షమాపణ చెప్పకుండా…. జగన్ మంత్రి వర్గానికి అభినందనలు చెప్పారు. ఫలితాలకు ముందు రెండో కృష్ణుడు లాగా లగడపాటి రాజగోపాల్ తరువాత మీడియా ముందుకు వచ్చిన నారాయణ…. గెలిచేది చంద్రబాబేనని నూటికి నూరు శాతం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడుతుందని నేను చెబుతున్నాను […]
చంద్రబాబుకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మైకుల ముందుకు వచ్చి ఆయనను ఆదుకునే సీపీఐ నారాయణ, జయప్రకాష్ నారాయణ మళ్ళీ తెరమీదకు వచ్చారు.
సీపీఐ నారాయణ అయితే ఏమాత్రం సిగ్గుపడకుండా గతంలో తను ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌కు క్షమాపణ చెప్పకుండా…. జగన్ మంత్రి వర్గానికి అభినందనలు చెప్పారు.
ఫలితాలకు ముందు రెండో కృష్ణుడు లాగా లగడపాటి రాజగోపాల్ తరువాత మీడియా ముందుకు వచ్చిన నారాయణ…. గెలిచేది చంద్రబాబేనని నూటికి నూరు శాతం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడుతుందని నేను చెబుతున్నాను రాసుకోండి అంటూ…. నమ్మబలికిన సీపీఐ నారాయణ ఆ స్టేట్ మెంట్ ఇచ్చినందుకు ఫలితాల తర్వాత ఎక్కడా పశ్చాత్తాపం ప్రకటించినట్లు లేదు.
మళ్ళీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
పనిలో పనిగా కక్ష పూరితంగా వ్యవహరించడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. కొద్దిరోజుల క్రితం మన మేథావి జయప్రకాష్ నారాయణ కూడా జగన్ కక్ష పూరితంగా వ్యవహరించడని తాను ఆశిస్తున్నట్టు చెప్పాడు.
వీళ్ళిద్దరి కవి హృదయం ఏమిటో అందరకూ తెలిసిందే. పాత ప్రభుత్వం పట్ల, చంద్రబాబు పట్ల కక్ష వద్దని…. ఆయనను ఇబ్బందులు పెట్టవద్దని చెప్పకనే చెప్పడం.
మిథున్ రెడ్డిని తిరుపతి ఎయిర్‌పోర్టు ఘటనలో కక్షపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం జైలుకు పంపించినట్లు…. జగన్ కూడా రేపు తెలుగుదేశం నాయకులను ఎవరినైనా అలా వేధిస్తే అప్పుడు ఇలాంటి నీతులు చెబితే బాగుంటుంది. అంతేకానీ పాత ప్రభుత్వ అవినీతి మీద విచారణ జరుపుతాను అంటుంటే…. కక్షలొద్దు…. సర్దుకుపోండి…. అని చెప్పడానికి వీళ్ళేమీ సిగ్గుపడడం లేదంటే…. ఎలాంటి పిచ్చితో…. ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారో అర్థం చేసుకుని జనాలే సిగ్గుపడుతున్నారు.