ఆగస్ట్... ఆగస్ట్... కలవరపడుతున్న చంద్రబాబు !
ఓవైపు అధికారం పోయింది. మరోవైపు భయం వెంటాడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకి భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఇంట్లో తెగ మథనపడుతున్నారట. రాజకీయంగా ముందుకు ఎలా వెళ్లాలి? అనే దానిపై చర్చలు జరుపుతున్నారట. ఏపీలో టీడీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా పార్టీ మారేందుకు నేతలు రెడీ అవుతున్నారట. అయితే ఈ నేతలు […]
ఓవైపు అధికారం పోయింది. మరోవైపు భయం వెంటాడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకి భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఇంట్లో తెగ మథనపడుతున్నారట. రాజకీయంగా ముందుకు ఎలా వెళ్లాలి? అనే దానిపై చర్చలు జరుపుతున్నారట.
ఏపీలో టీడీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా పార్టీ మారేందుకు నేతలు రెడీ అవుతున్నారట. అయితే ఈ నేతలు ఇప్పటికప్పుడు జంప్ కాకపోవచ్చు. ఇంకా రెండు నెలలు వెయిటింగ్ చేయొచ్చు.
ఈ రెండు నెలల వెయిటింగ్ టైమ్ చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు. రెండు నెలలు గడిస్తే వచ్చేది ఆగస్ట్. ఈ నెల అంటే టీడీపీ నేతలకు వణుకు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ నెలలోనే తెలుగుదేశం సంక్షోభాలు ఎదుర్కొంది, చాలా నష్టపోయింది. అయితే ఈ సారి వచ్చే నెలతో పార్టీ ఉంటుందా? మునిగిపోతుందా? అనే సందేహం మొదలైంది.
జగన్ సర్కార్ ఆగస్ట్ నెలలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం టీడీపీకి ఓ లెవల్లో బీపీ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల సమయంలోనే పార్టీ మారేందుకు చాలా మంది తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఏదో ఒక పదవి ఇస్తానంటే…. కుదిరితే వైసీపీ లేదా బీజేపీ అనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.
అనంతపురం జిల్లా నుంచి జేసీ ఫ్యామిలీ సహా చాలా కుటుంబాలు కాషాయ పార్టీ వైపు చూస్తున్నాయట. వీరే కాదు ఇంకా చాలా మంది నేతలు జంపింగ్ జపాంగ్ లిస్ట్ వైపు ఉన్నారని సమాచారం.
మొత్తానికి ఆగస్ట్ నెల కు ఇంకా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేతకు మాత్రం ఇప్పటినుంచే వణుకు స్టార్ట్ అయింది. మరీ ఆగస్ట్ నెల వచ్చే వరకూ ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.