Telugu Global
NEWS

రెడ్లకు తక్కువ మంత్రి పదవులు.... అందుకే

జగన్ కేబినెట్ లో రెడ్లను పక్కనపెట్టిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రోజా, ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి లాంటి సీనియర్లలో కొందరికి జగన్ మంత్రి పదవులు కేటాయించకపోవడం విశ్లేషకులనే కాదు…. సాధారణ ప్రజలను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే స్వయంగా రెడ్డి సామాజికవర్గమైన జగన్ తన పార్టీలో అదే కులానికి ప్రాధాన్యం ఇస్తున్నాడన్న ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్రచారానికి చెక్ […]

రెడ్లకు తక్కువ మంత్రి పదవులు.... అందుకే
X

జగన్ కేబినెట్ లో రెడ్లను పక్కనపెట్టిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రోజా, ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి లాంటి సీనియర్లలో కొందరికి జగన్ మంత్రి పదవులు కేటాయించకపోవడం విశ్లేషకులనే కాదు…. సాధారణ ప్రజలను కూడా ఆశ్చర్యపరిచింది.

అయితే స్వయంగా రెడ్డి సామాజికవర్గమైన జగన్ తన పార్టీలో అదే కులానికి ప్రాధాన్యం ఇస్తున్నాడన్న ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్రచారానికి చెక్ పెట్టడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది..

అందుకే తన కేబినెట్ లో బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చాడు జగన్. ఏకంగా ఏడు మంత్రిపదవులను బీసీలకు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

ఎస్సీలకు ఐదు, కాపులకు నాలుగు, రెడ్లకు నాలుగు పదవులు ఇచ్చారు.

ఇక రెడ్లకు ప్రాధాన్యం దక్కలేదని ఆయా వర్గాలు నొచ్చుకుంటున్న వేళ జగన్ వాళ్లను శాంతపరిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత విధేయుడైన కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి తాజాగా చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు.

మంత్రి పదవి వస్తుందని ఖచ్చితంగా వస్తుందని ఆశపడ్డ శ్రీకాంత్ రెడ్డికి సామాజిక వర్గమే గుదిబండ అయ్యింది. దీంతో నొచ్చుకోకుండా ఉండడానికి తన వెంట నడిచిన శ్రీకాంత్ రెడ్డికి జగన్ ఈ చీప్ విప్ పదవిని కట్టబెట్టడం విశేషం.

జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే రోజా, ధర్మానా, భూమన, ఆనం లాంటి వాళ్లకు పదవులు దక్కలేదు. పార్టీని ఆదరించిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ పార్టీ కోసం రెడ్లను త్యాగానికి సిద్ధపడేలా చేశారు.

First Published:  8 Jun 2019 1:15 AM GMT
Next Story