Telugu Global
NEWS

మన్ ప్రీత్ డబుల్ తో భారత్ రెండో గెలుపు

ఒలింపిక్స్ అర్హత హాకీలో భారత్ జోరు ఉజ్బెకిస్థాన్ తో భారత్ ఆఖరి రౌండ్ పోరు టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ టోర్నీలో మాజీ చాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రపంచహాకీ ఫైనల్స్ గ్రూప్- ఏ లీగ్ లో భారత్ 3-1 గోల్స్ తో పోలెండ్ ను అధిగమించి నాలుగుజట్ల గ్రూపులో టాపర్ గా నిలిచింది. ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్ కు.. ఆట మొదటి క్వార్టర్లో పోలెండ్ నుంచి […]

మన్ ప్రీత్ డబుల్ తో భారత్ రెండో గెలుపు
X
  • ఒలింపిక్స్ అర్హత హాకీలో భారత్ జోరు
  • ఉజ్బెకిస్థాన్ తో భారత్ ఆఖరి రౌండ్ పోరు

టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ టోర్నీలో మాజీ చాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రపంచహాకీ ఫైనల్స్ గ్రూప్- ఏ లీగ్ లో భారత్ 3-1 గోల్స్ తో పోలెండ్ ను అధిగమించి నాలుగుజట్ల గ్రూపులో టాపర్ గా నిలిచింది.

ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్ కు.. ఆట మొదటి క్వార్టర్లో పోలెండ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. మ్యాచ్ లో తొలిగోల్ ను పోలెండ్ జట్టే సాధించింది.

అయితే …ఆ తర్వాత నుంచి భారత ఆటగాళ్లు ఎదురుదాడులు చేసి… పూర్తి ఆధిపత్యంతో మూడు గోల్స్ సాధించారు.

భారత కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ఆట 21, 26 నిముషాలలో రెండుగోల్స్ సాధించగా…మూడో గోల్ ను పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఆట 36వ నిముషంలో సాధించడం ద్వారా తన జట్టు విజయాన్ని 3-1 గోల్స్ తో పూర్తి చేశాడు.

పూల్ ఆఖరి రౌండ్ పోటీలో ఉజ్బెకిస్థాన్ తో భారత్ పోటీపడుతుంది. రెండు పూల్స్ నుంచి రెండుజట్లకు మాత్రమే ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ కు అర్హతగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.

First Published:  8 Jun 2019 6:05 AM IST
Next Story