Telugu Global
NEWS

జగన్ వల్లే చంద్రబాబు సేఫ్

ఏపీలో అఖండ మెజార్టీతో గెలుపొందిన వైఎస్ జగన్…. తలుచుకుంటే ఈపాటికి టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉండేవారే…. కేవలం 23 సీట్లలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను లాగేయడం జగన్ కు పెద్ద లెక్క కాదు. పైగా టీడీపీ ఘోర ఓటమితో ఇప్పటికే కుదేలైన ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే జగన్ విలువలు కలిగిన పాలిటిక్స్ చంద్రబాబు, టీడీపీకి వరంగా మారాయి. చంద్రబాబు అలాంటి విలువలేమీ పాటించకుండా వైసీపీ తరపున […]

జగన్ వల్లే చంద్రబాబు సేఫ్
X

ఏపీలో అఖండ మెజార్టీతో గెలుపొందిన వైఎస్ జగన్…. తలుచుకుంటే ఈపాటికి టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉండేవారే…. కేవలం 23 సీట్లలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను లాగేయడం జగన్ కు పెద్ద లెక్క కాదు. పైగా టీడీపీ ఘోర ఓటమితో ఇప్పటికే కుదేలైన ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

అయితే జగన్ విలువలు కలిగిన పాలిటిక్స్ చంద్రబాబు, టీడీపీకి వరంగా మారాయి. చంద్రబాబు అలాంటి విలువలేమీ పాటించకుండా వైసీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలను, 23 ఎమ్మెల్యేలను టీడీపీలోకి పెద్ద ఎత్తున డబ్బులిచ్చి కొనుగోలు చేశాడు. కానీ జగన్ మాత్రం తన పార్టీలోకి ఎవరినైనా చేర్చుకోవాలంటే ముందుగా ఎమ్మెల్యే, ఎంపీల పదవులకు రాజీనామా చేసి రావాలని కోరుతాడు. అలా చేసి వచ్చాకే చేర్చుకుంటాడు. దీంతో వైసీపీలో చేరాలనుకునే వారు ముందు తమ పదవులకు రాజీనామా చేయాలి. ఇక్కడే ఎమ్మెల్యే, ఎంపీలు ఆ సాహసానికి వెనుకాడుతున్నారు.

ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టిన వారు మరోసారి ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేదు.

ఇక పక్కనున్న తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాన్ని బలహీన పర్చడానికి కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేశాడు. కాంగ్రెస్ నాయకులను చేర్చుకుంటూ సీఎల్పీనే నిన్న విలీనం చేసుకున్నారు. కానీ పక్కరాష్ట్రంలో జగన్ మాత్రం టీడీపీని కెలకకపోవడం.. నీట్ పాలిటిక్స్ తో ముందుకెళ్తుండడం చంద్రబాబు, ప్రతిపక్ష టీడీపీకి వరంగా మారింది.

వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఆ పార్టీకి ఎవరూ అడ్డు చెప్పే పరిస్థితి లేదు. అయితే ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో వలసలు ప్రోత్సహించకున్నా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో బలపడడానికి మాత్రం వైసీపీ ఆలోచిస్తోంది. సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బలమైన టీడీపీ నాయకులను చేర్చుకొని లాభపడాలని చూస్తోంది. ఈ రకంగానైనా టీడీపీని దెబ్బకొట్టడానికి జగన్ ముందుకెళ్తుండడం విశేషం.

First Published:  7 Jun 2019 4:25 PM IST
Next Story