ప్రాజెక్టులపై జగన్ కన్నెర్ర...!
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అప్పగించిన పనుల టెండర్లను పునఃపరిశీలించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశిస్తున్నారు. పోలవరం, రాయలసీమలోని ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలోని తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంచనాలకు మించి ప్రాజెక్టులపై వందల కోట్ల రూపాయలు ఎక్కువగా కోట్ చేయడం, ప్రజాధనాన్ని […]
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అప్పగించిన పనుల టెండర్లను పునఃపరిశీలించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశిస్తున్నారు.
పోలవరం, రాయలసీమలోని ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలోని తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంచనాలకు మించి ప్రాజెక్టులపై వందల కోట్ల రూపాయలు ఎక్కువగా కోట్ చేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు, వాటికి సంబంధించిన టెండర్ల ఖరారు వంటి అంశాలపై పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లపై నిగ్గు తేల్చేందుకు ఇంజనీరింగ్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.
ఈ కమిటీ 45 రోజుల్లోగా పూర్తి నివేదిక అందజేయాలని గడువు విధించారు. ఈ నివేదికలో ఇచ్చిన అంశాల ఆధారంగా పాత ప్రాజెక్టుల పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇక కొత్త ప్రభుత్వ హయాంలో చేపడుతున్న ప్రాజెక్టుల పనులపై కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏ జిల్లాలో అయితే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి వారి నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.