8న మంత్రుల ప్రమాణం.... 12 నుంచి శాసనసభ.... ఏపీలో రాజకీయ తొలకరి....
ఆంధ్రప్రదేశ్ లో సందడే సందడి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హంగామా. ఇదంతా ఏమిటనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం గవర్నర్ నరసింహన్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలోనూ అప్రతిహత విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో గడచిన […]
ఆంధ్రప్రదేశ్ లో సందడే సందడి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హంగామా. ఇదంతా ఏమిటనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శనివారం ఉదయం గవర్నర్ నరసింహన్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలోనూ అప్రతిహత విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
దీంతో గడచిన వారం రోజులుగా మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయోననే చర్చలు జరుగుతున్నాయి. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా విశ్వసనీయ వర్గాల పేరుతో పలువురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందంటూ కథనాలు రాస్తున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా అధినేత మనసులో ఏముందో మాత్రం బయటకు రావడం లేదు. దీంతో ప్రస్తుత చర్చలన్నీ మంత్రివర్గ కూర్పుపైనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థులు పన్నెండవ తేదీన ఒకరికొకరు ఎదురు అవుతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
ఈ నెల 12వ తేదీన శాసనసభ వేదికగా నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుసుకోనున్నారు. ఇలా ఇద్దరూ ఒకే వేదికపై కలవడం మూడున్నర సంవత్సరాలకు పైనే అయ్యింది.
ప్రతిపక్షంలో ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభను బహిష్కరించడంతో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నేరుగా కలుసుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఆ అపూర్వ సంఘటన ఈ నెల 12న రాబోతున్నది. ఆ రోజున కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరుగుతుంది.
అలాగే శాసన మండలి సభ్యుల సమావేశం కూడా 13వ తేదీన జరుగుతుంది. 14వ తేదీన ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. దీంతో ఈ వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మహా రంజుగా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.