ఉత్తమ్ రాజీనామా.... కాంగ్రెస్‌కు మరో టాస్క్
హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆయన రాజీనామా లేఖ అందజేశారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ్ రాజీనామాతో ఈ సీటులో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో […]
హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆయన రాజీనామా లేఖ అందజేశారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఉత్తమ్ రాజీనామాతో ఈ సీటులో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ ఫ్యామిలీ నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేస్తారు అనే ప్రచారం ఉంది.
ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు అక్కడి నుంచి ఆమె గెలిచారు. అయితే ఆమె హుజూర్‌నగర్‌కు మారేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరీ ఈ పరిస్థితుల్లో ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టీజేఎస్ నేత కోదండరాం కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ జానారెడ్డి లేదా ఆయన కొడుకు పోటీ చేస్తారా? అనేది చూడాలి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు వేలకు పైగా మెజార్టీతో ఉత్తమ్ గెలిచారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి ఈ సారి ఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ఈసారి టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశారు. మళ్లీ ఉప ఎన్నికల్లో డబ్బు పెట్టాలంటే రెడీగా లేమని ఉత్తమ్ కుటుంబం వర్గాలు అన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ వస్తే గానీ… హుజూర్‌నగర్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది క్లారిటీ రాదు.