ఫేస్‌బుక్ లో బాబుకు చురకలంటించిన టీడీపీ ఎంపీ
అధికారంలో ఉన్నన్నినాళ్లు పదవులను అనుభవించిన టీడీపీ నేతలు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు కూడా పదవుల కోసం కొట్టుకుంటుండడం సంచలనంగా మారింది. టీడీపీ తరుఫున గెలిచిందే ముగ్గురు ఎంపీలు.. అందులో ఇద్దరినీ పదవులకు ఎంపిక చేసిన చంద్రబాబు సీనియర్ అయిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి మాత్రం అత్తెసరు పదవి ఇచ్చాడు. దీంతో ఆయనలో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. బాబుకు వ్యతిరేకంగా ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టడం కలకలం రేపుతోంది. పార్లమెంట్ కు ఈసారి ముగ్గురు […]
అధికారంలో ఉన్నన్నినాళ్లు పదవులను అనుభవించిన టీడీపీ నేతలు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు కూడా పదవుల కోసం కొట్టుకుంటుండడం సంచలనంగా మారింది. టీడీపీ తరుఫున గెలిచిందే ముగ్గురు ఎంపీలు.. అందులో ఇద్దరినీ పదవులకు ఎంపిక చేసిన చంద్రబాబు సీనియర్ అయిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి మాత్రం అత్తెసరు పదవి ఇచ్చాడు. దీంతో ఆయనలో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. బాబుకు వ్యతిరేకంగా ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టడం కలకలం రేపుతోంది.
పార్లమెంట్ కు ఈసారి ముగ్గురు టీడీపీ ఎంపీలు వెళ్లారు. ముగ్గురే ఉండడంతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ను నియమించారు. ఇక లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా రామ్మోహన్ నాయుడికి పట్టం కట్టారు. ఈరెండు కీలక పదవులు. ఇక సాధారణ పార్టీ విప్ పదవిని కేశినేని నానికి ఇచ్చారు. మూడో ఎంపీ నానియే.. దీంతో ఆప్షన్ లేక బాబు ఈయనకు విప్ పదవి కట్టబెట్టాడు.
దీంతో కుర్ర ఎంపీలకు అత్యున్నత పదవిని ఇచ్చిన చంద్రబాబు తనను కావాలనే పక్కనపెట్టాడని మనసులో పెట్టుకున్న టీడీపీ సీనియర్ ఎంపీ కేశినేని నాని తన ఆక్రోశం వెళ్ళగక్కాడు. తాజాగా సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కారు.
‘పెద్ద పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ’ బాబుకు సెటైర్ వేశారు కేశినేని నాని.. కానీ తాను ఆ పదవిని స్వీకరించలేనని.. తాను అంత సమర్థుడిని కాదని పార్టీలో సమర్థవంతమైన నేతలకు పదవులు ఇవ్వాలంటూ బాబుకు సూచించారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే ఇష్టమంటూ ముగించారు. బాబు పదవిని తిరస్కరిస్తున్నందుకు సారీ చెప్పారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
I thank Sri Chandra Babu Naidu garu for appointing me as Party Whip in Loksabha.But I humbly request him to appoint…
Posted by Kesineni Nani on Tuesday, 4 June 2019