ధనియాలు.... పోపుల పెట్టెలో దివ్యౌషధం....
వంటింటి పోపుల పెట్టెలో మనకు దొరికే మరో దివ్యౌషధం ధనియాలు. ఇవి మంచి సువాసనను కూడా ఇస్తాయి. వీటిని నేరుగా తినకపోయినా ఆహారంలో విరివిగా వాడతారు. అయితే వీటి వల్ల ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. ధనియాలు త్రిదోషాలను హరిస్తాయి. పొట్టలోని వాతాన్ని తలకి ఎక్కకుండా కాపాడతాయి. పైత్యం, వికారం, ఎక్కిళ్లు, అతివేడిని అణుస్తాయి. వీటి కషాయం అన్ని రకాల దోషాలను హరిస్తుందన్నది అక్షర సత్యం. కడుపులో ఉన్న క్రిములను నశింప చేసి వ్యర్దాల ద్వారా బయటకి పంపడానికి […]
BY sarvi5 Jun 2019 12:30 AM IST
X
sarvi Updated On: 4 Jun 2019 11:55 AM IST
వంటింటి పోపుల పెట్టెలో మనకు దొరికే మరో దివ్యౌషధం ధనియాలు. ఇవి మంచి సువాసనను కూడా ఇస్తాయి. వీటిని నేరుగా తినకపోయినా ఆహారంలో విరివిగా వాడతారు. అయితే వీటి వల్ల ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం.
- ధనియాలు త్రిదోషాలను హరిస్తాయి. పొట్టలోని వాతాన్ని తలకి ఎక్కకుండా కాపాడతాయి.
- పైత్యం, వికారం, ఎక్కిళ్లు, అతివేడిని అణుస్తాయి. వీటి కషాయం అన్ని రకాల దోషాలను హరిస్తుందన్నది అక్షర సత్యం.
- కడుపులో ఉన్న క్రిములను నశింప చేసి వ్యర్దాల ద్వారా బయటకి పంపడానికి ధనియాలు దోహదపడతాయి.
- ధనియాల కషాయం తాగితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
- ధనియాల కషాయం ఆకలిని పుట్టిస్తుంది. జ్వరం తర్వాత వచ్చే అరుచిని తగ్గించి నాలుకకు రుచిని తెప్పిస్తుంది.
- చంటి పిల్లలకు త్వరగా జీర్ణం కావాలంటే ధనియాలను పొడిగా వేయించి, దానికి కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా పొడిచేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి మొదటి ముద్దలో పెడితే వారికి త్వరగా జీర్ణం అవుతుంది.
- పెద్దపిల్లలకైతే రెండు లేదా మూడు ఎండు మిరపకాయాలను చేర్చవచ్చు.
- ధనియాల కషాయం నీళ్ల విరోచనాలను అరికడుతుంది.
- ధనియాల చారు లేదా కషాయం శరీరాన్ని తేలిక పరచి మంచి ఉల్లాసాన్ని ఇస్తుంది.
- ధనియాలు అజీర్ణ సమస్యలను తొలగించడంతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నుంచి కాపాడుతుంది.
- శరీరంలో కొవ్వును నియత్రించడంలో ధనియాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
- ధనియాలను కొన్ని దేశాలలో యాంటీ డయాబెటిక్ ప్లాంట్ అని పిలుస్తారు. రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ను అదుపు చేస్తుంది.
- క్రమం తప్పకుండా ధనియాల కషాయాన్ని ఉదయానే తాగితే కొన్ని రోజులకు మీ శరీరంలో కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది.
- కొవ్వు కరిగిపోవడం వల్ల హర్ట్ ప్రోబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
- ధనియాలు శరీరంలో బ్యాక్టీరియా, ఫంగస్ లేదా ఇతర హానికర క్రిములతో పోరాడుతాయి.
- అంటువ్యాధులు అంటే చికెన్ ఫాక్స్ వంటివాటిని విస్తరించకుండా కాపాడతాయి.
- ధనియాలు, పసుపు పేస్ట్ ఎటువంటి చర్మసమస్యకైనా దివ్యౌషధం.
- రుతు సమస్యలకు లేదా ఆ సమస్యలో వచ్చే నొప్పిని ధనియాల కషాయం ద్వారా నియంత్రించవచ్చు.
Next Story