Telugu Global
NEWS

కవితకు మరో దురదృష్టం

తెలంగాణను ఏలుతున్న తండ్రి అండ ఒకవైపు.. ఉద్యమ పార్టీని లీడ్ చేస్తున్న అన్న కేటీఆర్ మరోవైపు.. ధైర్యంగా ముందుకెళ్లాల్సిన ఆ కల్వకుంట్ల ఆడబిడ్డకు ఇప్పుడు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల నుంచి నేటి పరిషత్ ఎన్నికల వరకు కల్వకుంట్ల కవితకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. కవితను దురదృష్టం చాలా వెంటాడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించి కవిత ఔరా […]

కవితకు మరో దురదృష్టం
X

తెలంగాణను ఏలుతున్న తండ్రి అండ ఒకవైపు.. ఉద్యమ పార్టీని లీడ్ చేస్తున్న అన్న కేటీఆర్ మరోవైపు.. ధైర్యంగా ముందుకెళ్లాల్సిన ఆ కల్వకుంట్ల ఆడబిడ్డకు ఇప్పుడు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల నుంచి నేటి పరిషత్ ఎన్నికల వరకు కల్వకుంట్ల కవితకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. కవితను దురదృష్టం చాలా వెంటాడుతోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించి కవిత ఔరా అనిపించింది. ముఖ్యంగా జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించి శభాష్ అనిపించుకుంది. తన తండ్రిని వైఎస్ హయాంలో ముప్పుతిప్పలు పెట్టిన జీవన్ రెడ్డిని ఓడించి ఆ విజయాన్ని కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చింది.

అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.. కవిత దూకుడు.. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ప్రోద్బలంతో చెలరేగిపోవడం.. ప్రతిపక్షాలకే కాదు.. స్వపక్షమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కంటగింపుగా మారింది. అందుకే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ కలగలిపి బీజేపీ గెలుపునకు దోహదం పడింది. రైతులను రంగంలోకి దించి కవితను ఓడించేలా చేసింది.

తాజాగా ఆ ఓటమితోనే బయట కనిపించకుండా పోయిన కవిత.. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో సొంత ఊరిలో ఓటమి చెంది మరింత కృంగిపోయారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కవితకు కోలుకోలేని షాక్ తగిలింది.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్ కవిత స్వగ్రామం కింద లెక్క. కవిత భర్త ఊరు.. సొంతూరు అన్నట్టే.. అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయాడు. బీజేపీ అభ్యర్థి 86ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం కవితకు షాక్ కు గురిచేసిందంటున్నారు. కవిత ప్రతీసారి ఓటు వేసే ఊళ్లోనే ఆమెకు షాక్ తగలడం టీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇలా పార్లమెంట్, పరిషత్ ఎన్నికల షాక్ తో కవితకు ఈ ఏడు ఏదీ కలిసిరాకుండా పోయింది.

First Published:  4 Jun 2019 10:17 AM IST
Next Story