Telugu Global
NEWS

ప్రపంచకప్ ఒకే ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు

పాక్ పై రూట్, బట్లర్ సెంచరీల మోత 2019 ప్రపంచకప్ తొలి సెంచరీ హీరో జో రూట్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో తొలిసెంచరీ సాధించిన ఘనతను ఆతిథ్య ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ దక్కించుకొన్నాడు. నాటింగ్ హామ్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో రూట్, జోస్ బట్లర్ సెంచరీలు సాధించడం విశేషం. వన్డే ప్రపంచకప్ 6వ మ్యాచ్ లో ఏకంగా రెండు సెంచరీలు నమోదయ్యాయి. నాటింగ్ హామ్ […]

ప్రపంచకప్ ఒకే ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు
X
  • పాక్ పై రూట్, బట్లర్ సెంచరీల మోత
  • 2019 ప్రపంచకప్ తొలి సెంచరీ హీరో జో రూట్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో తొలిసెంచరీ సాధించిన ఘనతను ఆతిథ్య ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ దక్కించుకొన్నాడు.

నాటింగ్ హామ్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో రూట్, జోస్ బట్లర్ సెంచరీలు సాధించడం విశేషం.

వన్డే ప్రపంచకప్ 6వ మ్యాచ్ లో ఏకంగా రెండు సెంచరీలు నమోదయ్యాయి. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వేదికగా
మాజీ చాంపియన్ పాకిస్థాన్ తో జరిగిన 6వ రౌండ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాళ్లు జో రూట్, జోస్ బట్లర్ సెంచరీల మోత
మోగించారు.

భారీభాగస్వామ్యం….

349 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు…రూట్- బట్లర్ జోడీ 5వ వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం సాధించడం ద్వారా.. సెంచరీలు నమోదు చేశారు.

వన్ డౌన్ జో రూట్ 104 బాల్స్ లో 10 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 107 పరుగులు, బట్లర్ 77 బాల్స్ లో 9 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 103 పరుగులు సాధించారు. జో రూట్ కెరియర్ లో ఇది 15వ వన్డే సెంచరీ కావడం విశేషం.

రూట్, బట్లర్ సెంచరీల మోత మోగించినా…ఈ మ్యాచ్ లో టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ కు 14 పరుగుల పరాజయం తప్పలేదు.

First Published:  4 Jun 2019 5:00 AM IST
Next Story