ఆత్మరక్షణలో ఆది
జమ్మలమడుగు ఆది..అదేనండీ…జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాడట. కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు పోయింది. అక్కడ రామసుబ్బారెడ్డి కూడా గెలవలేదు. కానీ మంత్రిగా ఆది చాలా వెనుకేసుకున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి…టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కింది. కడప జిల్లాలో తన ఆధిపత్యం చెలాయించాలని చూశాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు టీడీపీ ఓడిపోయింది. ప్రభుత్వం లేదు. పార్టీ కూడా జిల్లాలో మిగలలేదు. దీంతో […]
జమ్మలమడుగు ఆది..అదేనండీ…జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాడట. కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు పోయింది. అక్కడ రామసుబ్బారెడ్డి కూడా గెలవలేదు. కానీ మంత్రిగా ఆది చాలా వెనుకేసుకున్నాడు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి…టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కింది. కడప జిల్లాలో తన ఆధిపత్యం చెలాయించాలని చూశాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు టీడీపీ ఓడిపోయింది. ప్రభుత్వం లేదు. పార్టీ కూడా జిల్లాలో మిగలలేదు. దీంతో ఆదికి ఏం చేయాలో పాలుపోవడం లేదట.
టీడీపీలో ఉంటే కష్టం. వైసీపీలోకి వెళ్లే దారులు లేవు. ఆయన్ని జగన్ రానివ్వడు. దీంతో ఏదో ఒక అధికార పార్టీ చెంతకు చేరాలి. ఉన్నది ఒక్కటే ప్రత్యామ్నాయం…. అదే బీజేపీ. ఆ పార్టీలో చేరాలని ఆదినారాయణరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని కడప జిల్లాలో టాక్.
ఇప్పటికే తనకు తెలిసిన బీజేపీ నేతలతో ఆయన పార్టీలో చేరేందుకు చర్చలు జరిపాడట. కడప జిల్లాలో జగన్‌కు తానే మొదటి టార్గెట్ అని..తాను కమలం చెంతకు చేరితే కొంచెం ఉపశమనం పొందవచ్చని అనుకుంటున్నాడట. దీంతో బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే అక్కడి నుంచి మాత్రం ఈయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.
ఆదినారాయణరెడ్డికి అధికారం కోసం పార్టీలు మారడం కామన్. 2004 నుంచి 2010 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆతర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చెంతకు చేరాడు. పనులు చేయించుకున్నారు. 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో టీడీపీ వంచన చేరాడు. మంత్రి అయ్యాడు.
కానీ ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవడంతో మళ్లీ అధికారం కోసం పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. మరీ ఇలాంటి నేతను బీజేపీ దగ్గరకు తీస్తుందా? లేదా చూడాలి.