Telugu Global
NEWS

వైసీపీలో పదవుల పండగ

ఇన్నాళ్లు ప్రతిపక్షం.. చేతులు కట్టేసి ఉంటాయి. నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కానీ.. ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడానికి కానీ తగినంత స్కోప్ ఉండదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభంజనం.. అందుకే ఊరికే పదవులు వచ్చిపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ చేతుల్లో ఉన్న నామినేటెడ్ పోస్టులను రద్దు చేసి కొత్తవారికి ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ చేతిలో ఇప్పుడు నామినెటెడ్ పదవులు బోలెడున్నాయి. మరి ఈ పదవుల్లో ఎవరిని భర్తీ చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. గడిచిన అసెంబ్లీ […]

వైసీపీలో పదవుల పండగ
X

ఇన్నాళ్లు ప్రతిపక్షం.. చేతులు కట్టేసి ఉంటాయి. నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కానీ.. ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడానికి కానీ తగినంత స్కోప్ ఉండదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభంజనం.. అందుకే ఊరికే పదవులు వచ్చిపడుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ చేతుల్లో ఉన్న నామినేటెడ్ పోస్టులను రద్దు చేసి కొత్తవారికి ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ చేతిలో ఇప్పుడు నామినెటెడ్ పదవులు బోలెడున్నాయి. మరి ఈ పదవుల్లో ఎవరిని భర్తీ చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సోమిరెడ్డి సహా టీడీపీ మంత్రులు , ఎమ్మెల్సీలు.. తాము ఎలాగూ గెలుస్తామన్న ధీమాతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. వైసీపీ దాటికి వారంతా కొట్టుకుపోయారు.

ఇక వైసీపీ, టీడీపీ తరుఫున ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఉన్నారు. పయ్యావుల కేశవ్, కరణం బలరాం లాంటి టీడీపీ నేతలు ఎమ్మెల్సీలుగా పోటీచేశారు. వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడంతో పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలైన ఆళ్ల నాని, వీరభద్రస్వామిలు కూడా ఎమ్మెల్యేలుగా గెలవడంతో వారి ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవ్వబోతున్నాయి..

ఇలా ఎంతలేదన్నా టీటీడీ చైర్మన్ సహా పది వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మరి మొన్నటి ఎన్నికల వేళ వైసీపీ తరుఫున ప్రచారం చేసిన టాలీవుడ్ నటులు ఫృథ్వీ, మోహన్ బాబు, జీవితా రాజశేఖర్, అలీలకు జగన్ ఆ పదవులు ఇచ్చి రుణం తీర్చుకుంటారా? లేక వైసీపీ ప్రజాప్రతినిధులకే అవి ఇస్తారా అన్నది వేచిచూడాల్సిందే. మొత్తానికి వైసీపీలో పదవుల పండుగ మాత్రం మొదలైంది.

First Published:  3 Jun 2019 9:35 AM IST
Next Story