Telugu Global
NEWS

అటు ఉద్యోగాలు.... ఇటు ఉచిత సేవలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాలలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సినవన్నీ ఆ కార్యాలయం నుంచి అందించేలా ఏర్పాట్లు చేయడం గ్రామీణ ప్రజలకు ఆనందాన్ని కలుగజేస్తుంది. గ్రామాలలో ఖాళీగా ఉన్న యువతీ యువకులకు ఐదు వేల రూపాయల జీతంతో ప్రభుత్వ ప్రతినిధులుగా నియమించడం మంచి పరిణామమని చెబుతున్నారు. ప్రతి గ్రామంలోనూ చదువుకుని […]

అటు ఉద్యోగాలు.... ఇటు ఉచిత సేవలు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా గ్రామాలలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సినవన్నీ ఆ కార్యాలయం నుంచి అందించేలా ఏర్పాట్లు చేయడం గ్రామీణ ప్రజలకు ఆనందాన్ని కలుగజేస్తుంది.

గ్రామాలలో ఖాళీగా ఉన్న యువతీ యువకులకు ఐదు వేల రూపాయల జీతంతో ప్రభుత్వ ప్రతినిధులుగా నియమించడం మంచి పరిణామమని చెబుతున్నారు.

ప్రతి గ్రామంలోనూ చదువుకుని ఖాళీగా ఉన్న యువకులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి సొంత గ్రామాలలోనే ఉపాధి కల్పించడం, అది కూడా ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పడేలా చేయడం వంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలోనూ వందలాది గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక అంచనా మేరకు ఒక్కో జిల్లాలోనూ 10 నుంచి 15 వేల వరకు గ్రామ కార్యదర్శుల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు. అంటే ప్రతి జిల్లాలో 15 వేల మంది వరకు యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఖాళీగా ఉన్న యువతీ యువకులు ఉద్యోగార్ధులు కావడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తారని, దీనివల్ల అధికారుల అలసత్వం కూడా తగ్గుతుందంటున్నారు. గ్రామ కార్యదర్శుల వల్ల… గ్రామాల్లో ఎన్నాళ్లుగానో పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరుతాయని విశ్వసిస్తున్నారు.

First Published:  3 Jun 2019 4:17 AM IST
Next Story