రవి ప్రకాష్ లొంగిపోతాడా?
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోతే ఏం చేస్తాడు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఉన్న ఒక పెద్దాయన సహకరిస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వెంటనే లొంగిపోయే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రవిప్రకాష్ బెయిల్ కోసం రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశాడు. అయితే ఇక్కడే తెలంగాణ పోలీసులు కెవియట్ పిటిషన్ వేశారు. తమకు […]
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోతే ఏం చేస్తాడు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఉన్న ఒక పెద్దాయన సహకరిస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వెంటనే లొంగిపోయే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
రవిప్రకాష్ బెయిల్ కోసం రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశాడు. అయితే ఇక్కడే తెలంగాణ పోలీసులు కెవియట్ పిటిషన్ వేశారు. తమకు తెలియకుండా ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వారు కోరారు. దీంతో ఇప్పుడు సుప్రీం బెయిల్ ఇస్తుందా? లేదా అనేది చూడాలి.
మరోవైపు రవిప్రకాష్‌కు మీడియాలో చోటు లేకుండా పోతోంది. ఆయన ఏర్పాటు చేసిన మోజో టీవీ కూడా ఆయన మనుషుల నుంచి చేజారిపోయింది. మాజీ ఐఏఎస్, చంద్రబాబు బంధువు రామచంద్రనాయుడు కుమారుడు హరికిరణ్ చేరేడ్డి ఛైర్మన్‌గా ఉన్న మోజో టీవీ రవిప్రకాష్ అండతో వచ్చింది.
టీవీ9 నుంచి కొన్ని వస్తువులను తరలించడంతో పాటు…. కొంత మందికి అక్కడ నుంచి జీతాలు కూడా ఇచ్చారని కొత్త మేనేజ్‌మెంట్ అడిటింగ్‌లో తేలింది. దీంతో హరికిరణ్ చేతులేత్తేసి వెళ్లిపోయాడు. ఆయనపై కేసులు పెట్టేందుకు కొత్త యాజమాన్యం ప్రయత్నించడంతో ఆయన మోజోతో బంధం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోజోను టీవీ9 కొత్త యాజమాన్యం స్వాధీనం చేసుకుంది.
ఇటు ఈరోజు రవిప్రకాష్ బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈరోజు బెయిల్ రాకపోతే లొంగిపోవడం తప్ప…వేరే ఆప్షన్ ఆయన ముందు లేదు. మరోవైపు రవిప్రకాష్ రోజుకో చోట తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ విడిచి వెళ్లిన ఆయన బెంగళూరు,గుజరాత్ మధ్య చక్కర్లు కొడుతున్నారని సమాచారం.