Telugu Global
NEWS

ప్రపంచకప్ లో సౌతాఫ్రికాకు దెబ్బ మీద దెబ్బ

బంగ్లాదేశ్ చేతిలోనూ సఫారీలకు తప్పని ఓటమి షకీబుల్ ఆల్ రౌండ్ షోలో సౌతాఫ్రికా గల్లంతు వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో…మూడో ర్యాంకర్ సౌతాఫ్రికా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 10 జట్ల లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికాకు… చివరకు బంగ్లాదేశ్ చేతిలో సైతం పరాజయం తప్పలేదు. లండన్ వేదిక జరిగిన రెండోరౌండ్ పోటీలో బంగ్లాదేశ్ 21 పరుగులతో సౌతాఫ్రికాను కంగు తినిపించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో […]

ప్రపంచకప్ లో సౌతాఫ్రికాకు దెబ్బ మీద దెబ్బ
X
  • బంగ్లాదేశ్ చేతిలోనూ సఫారీలకు తప్పని ఓటమి
  • షకీబుల్ ఆల్ రౌండ్ షోలో సౌతాఫ్రికా గల్లంతు

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో…మూడో ర్యాంకర్ సౌతాఫ్రికా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 10 జట్ల లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికాకు… చివరకు బంగ్లాదేశ్ చేతిలో సైతం పరాజయం
తప్పలేదు.

లండన్ వేదిక జరిగిన రెండోరౌండ్ పోటీలో బంగ్లాదేశ్ 21 పరుగులతో సౌతాఫ్రికాను కంగు తినిపించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు సాధించింది.

సమాధానంగా 331 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సఫారీ టీమ్..8 వికెట్లకు 309 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సౌతాఫ్రికా కెప్టెన్ ఫాబ్ డూప్లెసీ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

బంగ్లా విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ షకీబుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి ఐదురోజుల పోటీలలో…ఇంగ్లండ్, విండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా విజయాలు సాధించగా.. సౌతాఫ్రికా రెండు పరాజయాలు చవిచూసింది. అప్ఘనిస్థాన్, శ్రీలంక, పాకిస్థాన్ సైతం తొలిరౌండ్ పరాజయాలు ఎదుర్కొన్నాయి.

First Published:  3 Jun 2019 4:15 AM IST
Next Story