5000 పరుగులు, 250 వికెట్లు
బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ ప్రపంచ రికార్డు సౌతాఫ్రికాతో ప్రపంచకప్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్…వన్డే క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. 199 వన్డేల్లోనే డబుల్ రికార్డు… వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు, 250 వికెట్లు సాధించిన ఆల్ రౌండర్ […]
- బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ ప్రపంచ రికార్డు
- సౌతాఫ్రికాతో ప్రపంచకప్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో
బంగ్లాదేశ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్…వన్డే క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
199 వన్డేల్లోనే డబుల్ రికార్డు…
వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు, 250 వికెట్లు సాధించిన ఆల్ రౌండర్ గా బంగ్లాదేశ్ ఎవర్ గ్రీన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
లండన్ వేదికగా సౌతాఫ్రికా తో ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా షకీబుల్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
ఐసీసీ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉన్న షకీబుల్…కేవలం 84 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 75 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్ లో తన కోటా 10 ఓవర్లలో 50 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.
పాక్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తెరమరుగు చేశాడు.
సకీబుల్ 199 వన్డేల్లో 5 వేల 717 పరుగులు సాధించడంతో పాటు 250 వికెట్లు పడగొట్టాడు. అబ్దుల్ రజాక్ 258 వన్డేల్లో 5 వేల పరుగులు, 250 వికెట్ల రికార్డు సాధించాడు.
షాహీద్ ఆఫ్రిదీ 296 వన్డేల్లోను, సనత్ జయసూర్య 304 వన్డేల్లో గ్రాండ్ డబుల్ సాధిస్తే…ఇప్పుడు…షకీబుల్ కేవలం 199 వన్డేల్లోనే ఈ ఘనత సాధించి.. వారేవ్వా అనిపించుకొన్నాడు.