Telugu Global
NEWS

పదవుల పందారంలో త్యాగధనులకే ప్రాధాన్యం..!

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీని వెనుక పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కష్టం ఎంతో ఉంది. అలాగే ప్రజలు ఆయన పట్ల పెట్టుకున్న నమ్మకమూ ఉంది. వీటికి తోడు పార్టీ కోసం గడచిన పది సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసి జగన్ కు అండగా నిలిచిన నాయకులూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు పెట్టిన కేసుల్లో ఇరుక్కున వారు, పత్రిపక్షంలో ఉండి ఆర్ధికంగా ఎన్నో […]

పదవుల పందారంలో త్యాగధనులకే ప్రాధాన్యం..!
X

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీని వెనుక పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కష్టం ఎంతో ఉంది. అలాగే ప్రజలు ఆయన పట్ల పెట్టుకున్న నమ్మకమూ ఉంది. వీటికి తోడు పార్టీ కోసం గడచిన పది సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసి జగన్ కు అండగా నిలిచిన నాయకులూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు పెట్టిన కేసుల్లో ఇరుక్కున వారు, పత్రిపక్షంలో ఉండి ఆర్ధికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారూ ఉన్నారు. అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, పచ్చ మీడియా వెక్కిరింతలను సైతం పంటి బిగివున దాచుకున్న నాయకులు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మందే ఉన్నారు.

జగన్ ను సీఎ్ంగా చూడాలన్న ఏకైక లక్ష్యంతో అవమానాలను భరించిన వారందరికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వీరితో పాటు ఇటీవల ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని కోల్పోయిన నాయకులు కూడా ఉన్నారు. వీరిందరికి జగన్ అధికారంలోకి వస్తే తమను మరచిపోరనే ఏకైక నమ్మకం. తమ నాయకుడు తాము పడిన కష్టాన్ని, తమ ఎదురుచూపులను పట్టించుకుంటారనే ఆశ. ఆ ఆశ తీరుతుందనే అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు.

ప్రభుత్వ పరంగా అనేక పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, పాలక మండలి సభ్యులు, గ్రంథాలయ సంస్ధల చైర్మన్లు, తిరుమల తిరుపతి దేవస్ధానంతో సహా రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చైర్మన్లు, పాలక మండలి సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ పదవుల భర్తీలో జగన్ వెంట ఇన్నాళ్లు నడిచిన వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. చివరి నిమిషంలో స్థానిక సమీకరణలతో టిక్కెట్లు రాని వారికి, గడచిన పదేళ్లుగా తన వెంట ఉన్న వారికి, ఇంత హోరులోను విజయం సాధించ లేకపోయిన వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు.

First Published:  2 Jun 2019 2:03 AM IST
Next Story