త్వరలోనే టీటీడీ బోర్డు రద్దు!
తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు రద్దుకు ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రభుత్వం మారినా రాజీనామా చేసేందుకు ఛైర్మన్ ముందుకు రావడం లేదు. కావాలంటే బోర్డును రద్దు చేసుకోమని ఓ సలహా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం వెంటనే బోర్డును రద్దు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కాబోతుంది. టీటీడీతో పాటు రాష్ట్రంలోని ఇతర ఆలయాల ధర్మకర్తల మండళ్ల రద్దుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కార్పొరేషన్లను కూడా రద్దు చేయబోతున్నట్లు తెలిసింది. […]
తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు రద్దుకు ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రభుత్వం మారినా రాజీనామా చేసేందుకు ఛైర్మన్ ముందుకు రావడం లేదు. కావాలంటే బోర్డును రద్దు చేసుకోమని ఓ సలహా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం వెంటనే బోర్డును రద్దు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కాబోతుంది.
టీటీడీతో పాటు రాష్ట్రంలోని ఇతర ఆలయాల ధర్మకర్తల మండళ్ల రద్దుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కార్పొరేషన్లను కూడా రద్దు చేయబోతున్నట్లు తెలిసింది.
గత ప్రభుత్వంలో నామినేటేడ్ పదవులు పొందిన వారు ఇప్పటికే రాజీనామా చేశారు. టీటీడీ బోర్డుమెంబర్స్ పొట్లూరి రమేష్ బాబు, కె. రాఘవేంద్రరావు, చల్లా రామచంద్రారెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. ఇతర పదవుల్లో ఉండి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు, బోండా ఉమ, బీకే పార్థ సారథి ఇంతకుముందే రాజీనామా చేశారు.
గతంలో టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు కనుమూరి బాపిరాజు కొన్నాళ్ల పాటు టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగారు. అయితే ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం బోర్దును రద్దు చేసింది. కొత్తవారిని నియమించింది. ఇప్పుడు అదే తీరుగా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.