Telugu Global
NEWS

క్రాప్ కాలనీ.... కేసీఆర్ కల ఫలిస్తే తెలంగాణ అన్నపూర్ణే

క్రాప్ కాలనీలు.. మామూలుగా ఇలాంటి పదాలు విదేశాల్లో ఎక్కువగా వినిపిస్తాయి. అమెరికా లాంటి దేశాల్లో వేల ఎకరాల్లో భూములున్నా కూడా అందరూ వ్యాపారాలు, ఉద్యోగాలు మాత్రమే చేయడానికి ఇష్టపడుతారు. వ్యవసాయం చేయడానికి ఇష్టపడరు. దీంతో ఆ భూములన్నింటిని కొందరు తీసుకొని క్రాప్ కాలనీలుగా మార్చేసి భారీ వ్యవసాయ యంత్రాలతో సాగు చేస్తుంటారు. భారీ దిగుబడి సాధించి వ్యవసాయంలో లాభాలు గడిస్తుంటారు. డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ సాగు ఖర్చు తగ్గించి ఎక్కువ లాభం పొందుతుంటారు. అమెరికా, ఇజ్రాయిల్ […]

క్రాప్ కాలనీ.... కేసీఆర్ కల ఫలిస్తే తెలంగాణ అన్నపూర్ణే
X

క్రాప్ కాలనీలు.. మామూలుగా ఇలాంటి పదాలు విదేశాల్లో ఎక్కువగా వినిపిస్తాయి. అమెరికా లాంటి దేశాల్లో వేల ఎకరాల్లో భూములున్నా కూడా అందరూ వ్యాపారాలు, ఉద్యోగాలు మాత్రమే చేయడానికి ఇష్టపడుతారు. వ్యవసాయం చేయడానికి ఇష్టపడరు.

దీంతో ఆ భూములన్నింటిని కొందరు తీసుకొని క్రాప్ కాలనీలుగా మార్చేసి భారీ వ్యవసాయ యంత్రాలతో సాగు చేస్తుంటారు. భారీ దిగుబడి సాధించి వ్యవసాయంలో లాభాలు గడిస్తుంటారు. డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ సాగు ఖర్చు తగ్గించి ఎక్కువ లాభం పొందుతుంటారు. అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో ఇలా క్రాప్ కాలనీలు హిట్ అయ్యాయి.

ఇప్పుడు అలాంటి ఫార్ములానే తెలంగాణలో కేసీఆర్ ముందు పెడుతున్నారు. తెలంగాణలోని చాలా మందికి ఎకరం, అరెకరం… రెండు ఎకరాలు ఉన్న రైతులే ఎక్కువ. ఐదు, పది ఎకరాలు కొద్దిమందికే ఉంటాయి. ఇప్పటికే సాగు భూమి విస్తీర్ణం లెక్కలు తీసిన కేసీఆర్ కు ఈ విషయం తెలుసు. అందుకే రైతులకు లాభాల పంట పండించేందుకు ఈ క్రాప్ కాలనీలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు.

తాజాగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కేసీఆర్.. తెలంగాణలో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేసి రైతుల దశమార్చేస్తానంటూ చెప్పుకొచ్చారు. నిజంగా ఇది కనుక అమలతై రైతులకు పంట వేయడం మొదలు.. సాగు, దిగుబడి, పంటకు సంబంధించి మొత్తం ఒక రైతు సమితికి అప్పగించడమో లేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగడమో జరుగుతుంటుంది.

ఇలా క్రాప్ కాలనీలు వేస్తే రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయి. ఆ ప్లాన్ ను కనుక తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తే తెలంగాణ అన్నపూర్ణగా మారడం ఖాయమని.. రైతుల తలరాత మారుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

First Published:  2 Jun 2019 7:49 AM IST
Next Story