Telugu Global
National

కొత్త మంత్రులకు మోదీ క్లాస్..!

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ… ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటున్నారు. తనతో పాటు మంత్రి వర్గ సహచరులు కూడా ఎక్కడా పెదవి జారడం కాని, పరుషంగా మాట్లాడడం కాని చేయరాదనే శాసిస్తున్నారు. ఇందుకోసం మంత్రివర్గ సహచరుల సమావేశంలో కొత్తగా మంత్రులైన వారికి ఎలా నడుచుకోవాలో ఓ క్లాస్ కూడా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో సారి అధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చినా… ఆ విజయం […]

కొత్త మంత్రులకు మోదీ క్లాస్..!
X

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ… ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటున్నారు. తనతో పాటు మంత్రి వర్గ సహచరులు కూడా ఎక్కడా పెదవి జారడం కాని, పరుషంగా మాట్లాడడం కాని చేయరాదనే శాసిస్తున్నారు.

ఇందుకోసం మంత్రివర్గ సహచరుల సమావేశంలో కొత్తగా మంత్రులైన వారికి ఎలా నడుచుకోవాలో ఓ క్లాస్ కూడా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రెండో సారి అధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చినా… ఆ విజయం దక్కే వరకూ క్షణక్షణం భయం వెంటాడుతూనే ఉందని, ఈ విజయంతో అహంకారం తలెకక్కకూడదనే అభిప్రాయాన్ని పార్టీలో ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలంటే వారిపై విరుచుకుపడడం ఎంత ముఖ్యమో… అంతే వినయంగా ఉండడం కూడా ముఖ్యమని కొత్త మంత్రులకు మోదీ ఉపదేశం ఇవ్వనున్నారు.

ముఖ్యంగా తొలిసారి మంత్రి పదవుల్లోకి వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రధానమంత్రే స్వయంగా చెప్పే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మర్నాడు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఉగ్రవాదులకే హైదరాబాద్ అడ్డాగా మారిందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆయనే కాదు హోం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అమిత్ షా కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని, తప్పుగా మాట్లాడ లేదని కిషన్ రెడ్డి వివరణ ఇచ్చినా…. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ వర్గాలే అంటున్నాయి. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే కొత్త మంత్రులు ఎలా వ్యవహరించాలో ముందుగా వారికి సీనియర్లు తెలియచేయాలని ప్రధాని మోదీ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

స్వయంగా తానే కొత్త మంత్రులకు నడవడిక, జాగ్రత్తలు చెప్తానని, సీనియర్లు కూడా వారికి హితబోధ చేయాలని అన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర్ర స్ధాయి నుంచి కేంద్ర స్ధాయికి వచ్చిన వారికి ఇక్కడి పరిస్థితులు తెలియవని, వాటిని వివరించాల్సిన బాధ్యత సీనియర్లదేననే అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 Jun 2019 2:18 AM IST
Next Story