జేసీ బ్రదర్స్ చూపు అటు వైపు మళ్లిందా?
తాడిపత్రి…అంటే ఇన్నాళ్లు జేసీ ఫ్యామిలీ గుర్తుకు వచ్చేంది. కానీ మొన్నటి ఎన్నికలతో ఆ కోట బద్దలైంది. తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. 8 వేల ఓట్ల మెజార్టీతో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తాడిపత్రే కాదు…. అనంతపురం ఎంపీగా పోటీ చేసిన జేసీ పవన్ కు కూడా విజయం దక్కలేదు. దీంతో జేసీ కుటుంబం అల్లాడిపోతోంది. ఇద్దరు వారసులు తొలి ఎన్నికల్లోనే ఓడిపోయారు. ఏం చేయాలో అర్ధం […]
తాడిపత్రి…అంటే ఇన్నాళ్లు జేసీ ఫ్యామిలీ గుర్తుకు వచ్చేంది. కానీ మొన్నటి ఎన్నికలతో ఆ కోట బద్దలైంది. తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. 8 వేల ఓట్ల మెజార్టీతో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
తాడిపత్రే కాదు…. అనంతపురం ఎంపీగా పోటీ చేసిన జేసీ పవన్ కు కూడా విజయం దక్కలేదు. దీంతో జేసీ కుటుంబం అల్లాడిపోతోంది. ఇద్దరు వారసులు తొలి ఎన్నికల్లోనే ఓడిపోయారు. ఏం చేయాలో అర్ధం కాక జేసీ సోదరులు తమ ఇంట్లో కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు.
అధికారం లేనిదే జేసీ ఫ్యామిలీ ఉండలేదు. గతంలో ఇది నిరూపితమైంది. దీంతో ఇప్పుడు అధికారం కోసం ఏం చేయాలా? అని జేసీ బ్రదర్స్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలోకి జగన్ రానివ్వరు. జిల్లా రాజకీయాల పరంగా చూసినా అది సాధ్యం కాదు. అటు టీడీపీ ఇప్పట్లో లేచే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీలోనే కాదు. ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు దగ్గర్లో లేవనే సంగతి జేసీ సోదరులకు తెలుసు. దీంతో తమ వారసులకు సేఫ్ ప్లేస్ కోసం జేసీ బ్రదర్స్ వెతుకుతున్నారట.
ఇప్పుడు ఉన్న టైమ్‌లో బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుందని జేసీ బ్రదర్స్ ఆలోచిస్తున్నారట. అందిరి కంటే ముందు బీజేపీలో చేరితే…. తమకు ప్రయారిటీ దొరుకుతుందని… అనంతపురంలో తాము చక్రం తిప్పవచ్చని అనుకుంటున్నారట.
ఇప్పటికే కొందరు బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రేపో మాపో జేసీ బ్రదర్స్ కమలం కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం తాడిపత్రిలో జోరుగా సాగుతోంది.