Telugu Global
National

చంద్రబాబుపై మోడీ యుద్ధం ప్రకటించినట్టే....

అనుకున్నట్టే అయ్యింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రతీకారం మొదలు పెట్టింది. మొన్నటి ఎన్నికల వేళ బీజేపీని గద్దెదించడానికి చంద్రబాబు చేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్ తో జట్టుకట్టి ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి హంగ్ వస్తే మోడీని గద్దెదించాలని నానా ప్లాన్లు చేశారు. కానీ బ్యాడ్ లక్ ఆయనే ఓడిపోయారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడం.. టీడీపీ ఏపీలో ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ బ్యాచ్ ప్రతీకారం మొదలు పెట్టేసింది. ముఖ్యంగా మోడీ, […]

చంద్రబాబుపై మోడీ యుద్ధం ప్రకటించినట్టే....
X

అనుకున్నట్టే అయ్యింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రతీకారం మొదలు పెట్టింది. మొన్నటి ఎన్నికల వేళ బీజేపీని గద్దెదించడానికి చంద్రబాబు చేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్ తో జట్టుకట్టి ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి హంగ్ వస్తే మోడీని గద్దెదించాలని నానా ప్లాన్లు చేశారు. కానీ బ్యాడ్ లక్ ఆయనే ఓడిపోయారు.

కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడం.. టీడీపీ ఏపీలో ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ బ్యాచ్ ప్రతీకారం మొదలు పెట్టేసింది. ముఖ్యంగా మోడీ, షాలు చంద్రబాబును వదిలేలా కనిపించడం లేదు. వచ్చే ఐదేళ్లలో టీడీపీని ఏపీలో బలహీన పరచడానికి ఎంత చేయాలో అంత చేయడానికి సిద్ధమవుతున్నారన్న వార్త కలకలం రేపుతోంది.

తాజాగా బీజేపీ…. టీడీపీ మూలాలను దెబ్బతీసే పనిని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇది వరకు ఎన్డీఏలో కేంద్రమంత్రిగా చేసి అనంతరం రాజీనామా చేసిన టీడీపీ నేత సుజనా చౌదరిని బీజేపీ టార్గెట్ చేసింది. ఐటీ, ఈడీ అధికారులు తాజాగా సుజనా చౌదరి ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు లెఫ్ట్ అండ్ రైట్ గా సుజనా చౌదరి, సీఎం రమేష్ లు ఉంటారని టీడీపీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. వీరిద్దరే టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారని చెబుతుంటారు. వీరిద్దరిపై ఇప్పటికే ఐటీ దాడులు చేయించగా…. తాజాగా సుజనా చౌదరిపై సీరియస్ గా దృష్టి పెట్టింది బీజేపీ.

ఆయనను దెబ్బకొడితే టీడీపీ ఆర్థిక మూలాల్లో ఒక వికెట్ ను నేలకూల్చినట్టే. అందుకే ఆయన కేసును త్వరగా తేల్చడానికి ఐటీ దాడులకు దిగారు. దీన్నిబట్టి టీడీపీ అధినేత చంద్రబాబుపై యుద్ధం మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.

First Published:  2 Jun 2019 6:57 AM IST
Next Story