Telugu Global
Cinema & Entertainment

కాంప్రమైస్ అయితేనే.... సినిమా అవకాశాలు

సినిమా పరిశ్రమలో…. కాస్టింగ్ కౌచ్ పై ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే హీరోయిన్లు, మరియు సీనియర్ నటులు మీడియా ముందుకు వచ్చి ధైర్యం గా దీని గురించి మాట్లాడుతూ ఉండడం అభినందించదగ్గ విషయమే. ఇప్పటికే చాలా మంది కాస్టింగ్ కౌచ్ మీద తమ అభిప్రాయలు తెలిపారు. తాజాగా తెలుగు సీనియర్ హీరోయిన్ రాధా ప్రశాంతి ఈ టాపిక్ పైన సంచలన ఆరోపణలు చేశారు. 1990 ల్లో ఆవిడ “పెళ్లి పందిరి”, ”కూతురు” వంటి హిట్ […]

కాంప్రమైస్ అయితేనే.... సినిమా అవకాశాలు
X

సినిమా పరిశ్రమలో…. కాస్టింగ్ కౌచ్ పై ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే హీరోయిన్లు, మరియు సీనియర్ నటులు మీడియా ముందుకు వచ్చి ధైర్యం గా దీని గురించి మాట్లాడుతూ ఉండడం అభినందించదగ్గ విషయమే. ఇప్పటికే చాలా మంది కాస్టింగ్ కౌచ్ మీద తమ అభిప్రాయలు తెలిపారు.

తాజాగా తెలుగు సీనియర్ హీరోయిన్ రాధా ప్రశాంతి ఈ టాపిక్ పైన సంచలన ఆరోపణలు చేశారు. 1990 ల్లో ఆవిడ “పెళ్లి పందిరి”, ”కూతురు” వంటి హిట్ మూవీస్ లో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే ఆవిడ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.

“తెలుగు సినిమా పరిశ్రమ లో నేను చూసిన చాలా మంది కాంప్రమైజ్ అయిన వాళ్లే. అలా కాంప్రమైజ్ కాకపోతే అవకాశాలు రావు అని అనుకున్న వాళ్ళే ఎక్కువ. కొంత మంది దర్శకులు చెప్పినట్లు వింటేనే అవకాశం ఇచ్చే వాళ్ళు, లేదంటే కొత్త వాళ్ళని తీసుకొనే వాళ్ళని….. కాంప్రమైజ్ అవ్వకపోతే తెలుగువాళ్లకు అవకాశాలు ఉండవు అనే స్థితి రావడం వలన చాలా మంది కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు” అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  2 Jun 2019 6:10 AM IST
Next Story