పాలనలో వేగంగా అడుగులు వేస్తున్న జగన్
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా చిన్న తడబాటు లేకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే చురుకుగా ఉన్నతాధికారుల నియామకం కూడా సాగిపోతోంది. విధానపరమైన నిర్ణయాలు కూడా జరిగిపోతున్నాయి. నిజానికి మే 23న ఫలితాలు వెల్లడి అయిన తరువాత నుంచే జగన్ పాలనాపరమైన అంశాల మీద దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏమిటో అధికారుల ద్వారా తెలుసుకోవడానికి యత్నించారు. ఆ తరువాత జగన్ సీఎంగా […]
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా చిన్న తడబాటు లేకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే చురుకుగా ఉన్నతాధికారుల నియామకం కూడా సాగిపోతోంది. విధానపరమైన నిర్ణయాలు కూడా జరిగిపోతున్నాయి.
నిజానికి మే 23న ఫలితాలు వెల్లడి అయిన తరువాత నుంచే జగన్ పాలనాపరమైన అంశాల మీద దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏమిటో అధికారుల ద్వారా తెలుసుకోవడానికి యత్నించారు. ఆ తరువాత జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక…. వివిధ శాఖల మీద సమీక్షలు నిర్వహించి శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ప్రకటించారు.
మే 30 గురువారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక తన పనులను మరింత వేగవంతం చేశారు. డీజీపీతోపాటు…. సీఎంఓ నియామకాలను పూర్తి చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఏడు వరకు సమీక్షలకు తేదీలు ఖరారు చేశారు. రోజుకు రెండు శాఖల మీద సమీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
జూన్ ఎనిమిదిన ఉదయం ఆయన సచివాలయ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు కొత్త మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. ఆ వెంటనే కొత్త కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలోనే కొన్ని కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని అంటున్నారు. రివర్స్ టెండరింగ్, కొత్త పనుల టెండర్లలో పారదర్శకత కోసం సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు తదితర అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అన్నింటి కంటే అతి ముఖ్యంగా జగన్ పాఠశాలల పరిస్థితులను శుక్రవారం సమీక్షించారు. మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయపాత్ర అనే పేరును ఖరారు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని మూడు వేలకు పెంచారు. అన్ని పాఠశాలలలో వెంటనే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, ఈ పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు గానీ, ఉపాధ్యాయులు గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని, ప్రతి విద్యార్థీ ప్రభుత్వ బడిలోనే చదువుకునే విధంగా మార్పులు జరగాలని అధికారులకు సూచించారు.
ఇలా జగన్ పాలనకు సంబంధించి చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం మీద మేధావులు, ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.