మోడీ పేరు చెప్పి తప్పించుకుంటున్న టీఆర్ఎస్
ఎవరైనా ఓటమికి కారణాలు వెతుకుతారు.. దీనివల్లే ఓడిపోయామని చెబుతారు. ఏపీలోనూ చంద్రబాబు.. ఇంతటి ప్రజావ్యతిరేతను ఊహించలేదన్నారు. ప్రజలను ఇంత కష్టపెట్టామా అని ఓడిపోయాక వ్యాఖ్యానించారట. చంద్రబాబు ఆ ముక్క అయినా చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ 9 స్థానాలకే చాప చుట్టేయడంపై కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సైతం జగన్ కు శుభాకాంక్షలు చెప్పి ఓటమిపై విశ్లేషణలు మొదలు పెట్టారు. నాయకులతో చర్చలు జరుపుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎవ్వరినీ దగ్గరకు రానీయట్లేదు. ఓటమిపై స్పందించడం […]
ఎవరైనా ఓటమికి కారణాలు వెతుకుతారు.. దీనివల్లే ఓడిపోయామని చెబుతారు. ఏపీలోనూ చంద్రబాబు.. ఇంతటి ప్రజావ్యతిరేతను ఊహించలేదన్నారు. ప్రజలను ఇంత కష్టపెట్టామా అని ఓడిపోయాక వ్యాఖ్యానించారట. చంద్రబాబు ఆ ముక్క అయినా చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ 9 స్థానాలకే చాప చుట్టేయడంపై కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు సైతం జగన్ కు శుభాకాంక్షలు చెప్పి ఓటమిపై విశ్లేషణలు మొదలు పెట్టారు. నాయకులతో చర్చలు జరుపుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎవ్వరినీ దగ్గరకు రానీయట్లేదు. ఓటమిపై స్పందించడం లేదు. కారణాలను వెతకడం లేదు.. ఎందుకంటే కేసీఆర్ కు ఎందుకు ఓడిపోయిందీ తెలుసు కాబట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
తాజాగా కరీంనగర్ లో బీజేపీ చేతిలో ఓడిపోయిన సీనియర్ నేత వినోద్ స్పందించారు. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచిందని.. తెలంగాణలోనూ అదే కనిపించిందని.. అందుకే కరీంనగర్ లో ఓడిపోయానని క్లారిటీ ఇచ్చారు. ఓటర్లందరూ పార్లమెంట్ ఎన్నికలను జాతీయ కోణంలో చూసి బీజేపీ, కాంగ్రెస్ లకు ఓటు వేసి గెలిపించారని చెప్పుకొచ్చారు.
ఇలా కేసీఆర్ కు సన్నిహితుడైన వినోద్ చెప్పిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా ఈ ఆరు నెలల్లో కేసీఆర్ పాలన తీరు.. హరీష్ ను పక్కనపెట్టడం.. కేటీఆర్ ను అందలం ఎక్కించడం.. హిందువులు బొందువులు అనడం లాంటి వల్లే టీఆర్ఎస్ పుట్టి మునిగిందని విశ్లేషణలు సాగుతున్నాయి. వాటిని ప్రస్తావించకుండా బీజేపీ, మోడీ హవాను టీఆర్ఎస్ తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.