రోజర్ ఫెదరర్ మరో గ్రాండ్ రికార్డు
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో 400 మ్యాచ్ ల ఏకైక ఆటగాడు ఫ్రెంచ్ ఓపెన్ ప్రీక్వార్టర్ ఫైనల్లో టెన్నిస్ గ్రేట్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో…తిరుగులేని మొనగాడు రోజర్ ఫెదరర్ తన పేరుతో మరో అరుదైన రికార్డు లిఖించుకొన్నాడు. వింబుల్డన్, అమెరికన్, ఆస్ర్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ లతో కూడిన గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 400 మ్యాచ్ లు ఆడిన తొలి, ఏకైక ఆటగాడిగా స్విట్జర్లాండ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ నిలిచాడు. 2019 ఫ్రెంచ్ ఓపెన్ మొదటి వారం […]
- గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో 400 మ్యాచ్ ల ఏకైక ఆటగాడు
- ఫ్రెంచ్ ఓపెన్ ప్రీక్వార్టర్ ఫైనల్లో టెన్నిస్ గ్రేట్
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో…తిరుగులేని మొనగాడు రోజర్ ఫెదరర్ తన పేరుతో మరో అరుదైన రికార్డు లిఖించుకొన్నాడు.
వింబుల్డన్, అమెరికన్, ఆస్ర్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ లతో కూడిన గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 400 మ్యాచ్ లు ఆడిన తొలి, ఏకైక
ఆటగాడిగా స్విట్జర్లాండ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ నిలిచాడు.
2019 ఫ్రెంచ్ ఓపెన్ మొదటి వారం రోజుల పోటీలలో మూడో రౌండ్ విజయంతో…ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టాడు.
ఫ్రెంచ్ ప్రీ-క్వార్టర్స్ లో 14వసారి…
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో 3వ సీడ్ గా బరిలోకి దిగిన ఫెదరర్…రోలాండ్ గారోస్ స్టేడియం వేదికగా ముగిసిన 3వ రౌండ్ పోటీలో.. కాస్పర్ రూడ్ పై 6-3, 6-1, 7-6తో విజేతగా నిలిచాడు. 38 ఏళ్ల ఫెదరర్ మొత్తం 2 గంటల 11 నిముషాల పోరులో 53 విన్నర్లు సాధించాడు.
ఇందులో ఫోర్ హ్యాండ్ ద్వారా సాధించినవే 23 పాయింట్లు ఉన్నాయి.
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో తన 400వ మ్యాచ్ ను విజయంతో ముగించిన ఫెదరర్… ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్ చేరడం ఇది 14వసారి కావడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగే పోటీలో అర్జెంటీనా ఆటగాడు లియోనార్డో మేయర్ తో ఫెదరర్ పోటీపడతాడు.
లేటు వయసులో ప్రీ-క్వార్టర్స్ రికార్డు…
అంతేకాదు…గత 47 సంవత్సరాల కాలంలో ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్ చేరిన అతిపెద్దవయస్కుడైన ఆటగాడిగా ఫెదరర్ రికార్డుల్లో చేరాడు.
38 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ-క్వార్టర్స్ చేరిన ప్లేయర్ గా నిలిచాడు.
నాలుగోరౌండ్లో రఫా…
మరోవైపు…11 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ కింగ్, రెండో సీడ్, హాట్ ఫేవరెట్ రాఫెల్ నడాల్ సైతం నాలుగోరౌండ్ కు అర్హత సాధించాడు.
బెల్జియం ఆటగాడు డేవిడ్ గోఫిన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని నాలుగు సెట్ల పోరులో విజేతగా నిలిచాడు. నడాల్ 6-1, 6-3, 4-6, 6-3తో నెగ్గి.. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.
నిషికోరీ మారథాన్ విన్….
ఆసియా ఆశాకిరణం, 7వ సీడ్ నిషికోరీ…4 గంటల 26 నిముషాల మారథాన్ సమరంలో…సెర్బియా ఆటగాడు లాస్లో జీరీని.. 6-4, 6-7, 6-3, 4-6, 8-6తో అధిగమించి…క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టాడు.
మొత్తం మీద…నాలుగోరౌండ్ నుంచే ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ హాట్ హాట్ గా మారాయి.