అందరూ రాజీనామాలు చేస్తున్నా... నేను చేయను
కొత్త ప్రభుత్వం ఏర్పడగానే…. పాత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు రాజీనామా చేయడం ఆనవాయితి. దీనిని గౌరవిస్తూ నాలుగురోజుల క్రితమే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ప్రముఖ సినీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు బాబు రాజీనామా చేశారు. దుర్గగుడి పాలకమండలి సభ్యులు కూడా తమ రాజీనామాను సమర్పించారు. వక్స్‌బోర్డ్ ఛైర్మన్ పదవికి జలీల్‌ఖాన్ ఈరోజు రాజీనామా చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి వేమూరి ఆనంద సూర్య కూడా రాజీనామా […]
కొత్త ప్రభుత్వం ఏర్పడగానే…. పాత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు రాజీనామా చేయడం ఆనవాయితి.
దీనిని గౌరవిస్తూ నాలుగురోజుల క్రితమే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ప్రముఖ సినీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు బాబు రాజీనామా చేశారు.
దుర్గగుడి పాలకమండలి సభ్యులు కూడా తమ రాజీనామాను సమర్పించారు.
వక్స్‌బోర్డ్ ఛైర్మన్ పదవికి జలీల్‌ఖాన్ ఈరోజు రాజీనామా చేశారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి వేమూరి ఆనంద సూర్య కూడా రాజీనామా చేశారు.
సినిమా, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవికి అంబికాకృష్ణ రాజీనామా చేశారు.
జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రి చైర్మన్ పదవికి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కొడుకు కూడా తన రాజీనామాను ఈరోజు సమర్పించారు.
ఇలా అందరూ రాజీనామా బాటలో ఉంటే…. ఒక్క టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ మాత్రం తాను రాజీనామా చేయనని, తనను తొలిగించాలనుకుంటే పాలకమండలిని రద్దుచేయమని ప్రభుత్వానికి ఒక ఉచిత సలహా ఇచ్చారు.