Telugu Global
Cinema & Entertainment

ఎన్జీకే మొదటి రోజు వసూళ్లు

సూర్య, శ్రీరాఘవ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్ జీ కే సినిమాకు మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఈ విషయం మేకర్స్ కు కూడా తెలుసు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. మొదటి 3 రోజుల్లోనే మొత్తం రాబట్టాలనే ప్లాన్ తో ఇలా చేశారు. ఒక్క తెలంగాణలోనే 170కి పైగా థియేటర్లలో ఎన్ జీ కే విడుదలైందంటే ప్లానింగ్ అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమానైతే భారీ ఎత్తున విడుదల […]

ఎన్జీకే మొదటి రోజు వసూళ్లు
X

సూర్య, శ్రీరాఘవ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్ జీ కే సినిమాకు మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఈ విషయం మేకర్స్ కు కూడా తెలుసు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. మొదటి 3 రోజుల్లోనే మొత్తం రాబట్టాలనే ప్లాన్ తో ఇలా చేశారు. ఒక్క తెలంగాణలోనే 170కి పైగా థియేటర్లలో ఎన్ జీ కే విడుదలైందంటే ప్లానింగ్ అర్థం చేసుకోవచ్చు.

అయితే సినిమానైతే భారీ ఎత్తున విడుదల చేశారు కానీ, ప్రేక్షకుల్ని మాత్రం ఆ స్థాయిలో థియేటర్లలోకి రప్పించలేకపోయారు. ఈ సినిమాకు 40శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ వచ్చింది. అలా మొదటి రోజు బొటాబొటిగా ఆక్యుపెన్సీ తెచ్చుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ షేర్ వచ్చింది.

సూర్య సినిమాలకు తెలుగులో మార్కెట్ తగ్గి చాన్నాళ్లయింది. ఎన్ జీ కే మొదటి రోజు ఆక్యుపెన్సీ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అందుకే ఏరియా వైజ్ బ్రేక్-అప్ విడుదల చేయలేదు మేకర్స్. ఇప్పటికే సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో.. ఈరోజు, రేపు ఈ మూవీ థియేటర్లలో కొనసాగే ఛాన్స్ ఉంది. సోమవారం నుంచి మాత్రం ఎన్ జీ కేకు వసూళ్లు రావడం కష్టమే.

First Published:  1 Jun 2019 12:41 PM IST
Next Story