Telugu Global
NEWS

సుజానా చౌదరి ఇళ్లు, కార్యాలయాలలో సీబీఐ సోదాలు

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలలో ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అర్థికంగా అండగా ఉండే సుజానా చౌదరిపై గత ఆరు నెలలుగా సీబీఐ కన్నేసింది. తను చేసే వ్యాపారాలలో జీఎస్టీ చెల్లింపుల అవకతవకలతో పాటు.. బ్యాంకులను మోసం చేశాడనే విషయంపై కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో సుజానా చౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని పిలిచినా […]

సుజానా చౌదరి ఇళ్లు, కార్యాలయాలలో సీబీఐ సోదాలు
X

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలలో ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అర్థికంగా అండగా ఉండే సుజానా చౌదరిపై గత ఆరు నెలలుగా సీబీఐ కన్నేసింది. తను చేసే వ్యాపారాలలో జీఎస్టీ చెల్లింపుల అవకతవకలతో పాటు.. బ్యాంకులను మోసం చేశాడనే విషయంపై కేసులు నమోదయ్యి ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే గతంలో సుజానా చౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని పిలిచినా ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు పంజాగుట్ట లోని ఆయన కార్యాలయంపై ఏకకాలంలో దాడిచేశారు.

బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐలోని బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో సుజనా చౌదరి మరో మాజీ సీబీఐ అధికారి అయిన విజయరామారావు కుమారుడితో కలిసి వ్యాపారం చేశారు. ఆ సంస్థ పేరుతో అక్రమంగా రుణాలు తీసుకోవడమే కాక చెల్లింపులు కూడా నిలిపివేశారు. బ్యాంకులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించలేదు.

దీంతో గతంలోనే బ్యాంకులు నమోదు చేసిన కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇవాళ ఏకకాలంలో సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తోంది.

First Published:  1 Jun 2019 12:12 PM IST
Next Story