అక్కడ కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయా?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి సంబంధించిన వేడి ఇంకా చల్లారడం లేదు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగిన కవిత అక్కడ అనూహ్యంగా ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. పరాజయానికి కారణాలంటూ రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుండడం టీఆర్ఎస్ వర్గాలలో కలకలం రేపుతోంది. బంతిని గులాబీ కోర్టులోకే నెట్టేయాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తుండగా, ఆ రెండు పార్టీలు రహస్యంగా కలిసి పోవడంతోనే కవిత గెలుపొందలేదని […]
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి సంబంధించిన వేడి ఇంకా చల్లారడం లేదు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగిన కవిత అక్కడ అనూహ్యంగా ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. పరాజయానికి కారణాలంటూ రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుండడం టీఆర్ఎస్ వర్గాలలో కలకలం రేపుతోంది.
బంతిని గులాబీ కోర్టులోకే నెట్టేయాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తుండగా, ఆ రెండు పార్టీలు రహస్యంగా కలిసి పోవడంతోనే కవిత గెలుపొందలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
అయితే కవిత ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమనే విషయాలు ఇప్పుడు బలంగా
తెర మీదకు వస్తున్నాయి. తమ ఆధిపత్యానికి ఆటంకంగా మారారనే కారణంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు తెర వెనుక కవితకు వ్యతిరేకంగా పని చేశారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
ఫలితాల తరువాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రహస్యంగా కలుసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా సీఎం కేసీఆర్ చెవిన కూడా పడిందని, దీంతో ఆయన నిజామాబాద్ లో అసలు ఏం జరిగిందో ఆరా తీయాల్పిందిగా తనకు సన్నిహితంగా ఉండే నేతలకు సూచించినట్టు సమాచారం.
దీంతో అక్కడి పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయని అంటున్నారు. ఈ అంశం ఎటు పోయి ఎటు వస్తుందోనని వారు అందోళన చెందుతున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారమంతా తుఫాను ముం
దటి ప్రశాంతతలా ఉందని, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
బోధన్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం, పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడం, ఎర్ర జొన్న రైతులకు గిట్టుబాటు ధర గురించి పట్టించుకోకపోవడంలాంటివి కవిత ఓటమికి కారణాలని బయటకు చెబుతున్నా తెర వెనుక భారీ వ్యూహమేదో బలంగా పని చేసిందని టీఆర్ఎస్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
గతంలో నిజామాబాద్ ఎంపీగా పని చేసిన మధుయాష్కీ ఈ సారి కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు ఈసారి ఎన్నికలలో డిపాజిట్ కూడా దక్కలేదు. నిజంగా
కవిత మీద ప్రజలలో వ్యతిరేకత ఉంటే, ఆ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ లకు సమానంగా పడి తీరాలని, ఒక్క బీజేపీకే అత్యధిక ఓట్లు రావడంలో ఆంతర్యం ఏమిటని కొందరు
అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ రహస్యంగా కలిసిపోయాయనడానికి ఇంత కంటే నిదర్శనం ఇంకేం కావాలని చెబుతున్నారట. ఏది ఏమైనా కవిత ఓటమికి గల కారణాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ గానే పరిశీలిస్తున్నారని అంటున్నారు.