మోడీ క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తన క్యాబినెట్ టీంతో నిన్న ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఎవరికి ఏయే బాధ్యతలు అప్పగించారనే ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇవాళ అందరూ మంత్రులకు తమ పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. అమిత్ షాకు హోం శాఖ ఇవ్వగా.. గతంలో హోం శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖకు వెళ్లారు. తెలంగాణ నుంచి మంత్రి అయిన కిషన్ […]
సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తన క్యాబినెట్ టీంతో నిన్న ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఎవరికి ఏయే బాధ్యతలు అప్పగించారనే ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇవాళ అందరూ మంత్రులకు తమ పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. అమిత్ షాకు హోం శాఖ ఇవ్వగా.. గతంలో హోం శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖకు వెళ్లారు. తెలంగాణ నుంచి మంత్రి అయిన కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించింది.
మిగతా వారి పోర్ట్ ఫోలియోలు ఇలా ఉన్నాయి…
1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి)
2. రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ శాఖ)
3. అమిత్ షా (హోం శాఖ)
4. నితిన్ గడ్కరీ (రోడ్లు, రవాణా శాఖ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు )
5. సదానంద గౌడ (ఎరువులు, రసాయన శాఖ)
6. నిర్మలా సీతారామన్ (ఆర్థిక శాఖ)
7. రాంవిలాస్ పాశ్వాన్ (వినియోగదారుల వ్యవహారాల శాఖ )
8. నరేంద్ర సింగ్ తోమర్ (వ్యవసాయ శాఖ)
9. రవిశంకర్ ప్రసాద్ (న్యాయ శాఖ)
10. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ)
11. థావర్ చంద్ గెహ్లాట్ (సామాజిక న్యాయ శాఖ)
12. సుబ్రహ్మణ్యం జయశంకర్ (విదేశాంగ శాఖ)
13. రమేశ్ పోఖ్రియాల్ (మానవ వనరులు శాఖ)
14. అర్జున్ ముండా (గిరిజన వ్యవహారాల శాఖ)
15. స్మృతి ఇరానీ ( మహిళా శిశు సంక్షేమం, జౌళి శాఖ)
16. డాక్టర్ హర్షవర్థన్ (వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ)
17. ప్రకాశ్ జవదేకర్ (పర్యావరణ శాఖ, ప్రసార సమాచార శాఖ)
18. పీయూష్ గోయల్ (రైల్వే శాఖ)
19. ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం శాఖ)
20. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ (మైనారిటీ వ్యవహారాల శాఖ)
21. ప్రహ్లాద్ జోషీ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ)
22. మహేంద్రనాథ్ పాండే (నైపుణ్యాభివృద్ధి శాఖ )
23. అరవింద్ సావంత్ (భారీ పరిశ్రమల శాఖ)
24. గిరిరాజ్ సింగ్ (పాడి, పశుగణాభివృద్ధి)
25. గజేంద్ర సింగ్ షెకావత్ (జల శక్తి)
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1. సంతోష్ కుమార్ గాంగ్వర్ (శ్రామిక, ఉపాధి కల్పన శాఖ)
2. ఇంద్రజిత్ సింగ్ (ప్రణాళిక, గణాంక శాఖ)
3. శ్రీపాద యశో నాయక్ (ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి)
4. జితేంద్ర సింగ్ (సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి)
5. కిరణ్ రిజిజు (క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు)
6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ (సాంస్కృతిక పర్యాటక శాఖ)
7. రాజ్ కుమార్ సింగ్ (విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి)
8. హర్దీప్ సింగ్ పూరి (గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ)
9. మన్ సుఖ్ మాండవ్య (షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు)
సహాయ మంత్రులు
1. ఫగ్గీన్ సింగ్ కులస్తే (ఉక్కు శాఖ)
2. అశ్వినీ చౌబే (కుటుంబ, ఆరోగ్య శాఖ)
3. అర్జున్ రామ్ మేఘవాల్ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, భారీ పరిశ్రమలు)
4. జనరల్ వీకే సింగ్ (రోడ్లు, రహదారులు శాఖ)
5. కిృషన్ పాల్ గుజ్జర్ (సాధికారిత, సామాజిక న్యాయం)
6. దాదారావ్ పాటిల్ (పౌర, ప్రజా సరఫరాల శాఖ)
7. కిషన్ రెడ్డి (హోంశాఖ సహాయమంత్రి)
8. పురుషోత్తం రూపాలా (వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ)
9. రాందాస్ అథవాలే (సాధికారిత, సామాజిక న్యాయం)
10. సాధ్వీ నిరంజన్ జ్యోతి (గ్రామీణాభివృద్ధి శాఖ)
11. బాబుల్ సుప్రియో (అటవీ, పర్యావరణ శాఖ)
12. సంజీవ్ కుమార్ బాల్యాన్ (పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్)
13. దోత్రే సంజయ్ శ్యారావ్ (మానవ వనరుల శాఖ,ఐటీ శాఖ)
14. అనురాగ్ సింగ్ ఠాకూర్ (ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ)
15. సురేష్ అంగాడి ( రైల్వేస్)
16. నిత్యానంద్ రాయ్ (హోంశాఖ)
17. రత్తన్ లాల్ కఠారియా (జల్‌శక్తి, సాధికారిత, సామాజిక న్యాయం)
18. వి.మురళీధరన్ ( పార్లమెంటరీ వ‍్యవహారాలు, ఇంటర్నల్ ఎఫైర్స్)
19. రేణుకా సింగ్ (గిరిజన శాఖ)
20. సోమ్ ప్రకాశ్ (వాణిజ్య, పరిశ్రమలు శాఖ)