Telugu Global
NEWS

వెంకయ్యతో రాయబారం.... బాబును బీజేపీ రానిస్తుందా?

ఒక్క దెబ్బతో చంద్రబాబు డమ్మీ అయిపోయారు. కేంద్రంలో చక్రం తిప్పుదామని చూసిన ఆయన ఇప్పుడు ఘోర ఓటమితో అమరావతికే పరిమితం అయ్యారు. హంగ్ వస్తే కాంగ్రెస్ తో కలిసి కీలక పాత్ర పోషించాలని అనుకున్నారు. కానీ జనాలు మాత్రం మోడీకి క్లియర్ కట్ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అయితే ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? బీజేపీ పంచన చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఘోర […]

వెంకయ్యతో రాయబారం.... బాబును బీజేపీ రానిస్తుందా?
X

ఒక్క దెబ్బతో చంద్రబాబు డమ్మీ అయిపోయారు. కేంద్రంలో చక్రం తిప్పుదామని చూసిన ఆయన ఇప్పుడు ఘోర ఓటమితో అమరావతికే పరిమితం అయ్యారు. హంగ్ వస్తే కాంగ్రెస్ తో కలిసి కీలక పాత్ర పోషించాలని అనుకున్నారు. కానీ జనాలు మాత్రం మోడీకి క్లియర్ కట్ మెజార్టీ ఇచ్చి గెలిపించారు.

అయితే ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? బీజేపీ పంచన చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఘోర తప్పిదం చేశామని టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చింది. మరోసారి ఆ కూటమిలోకి వెళ్లడానికి రాయబారం నడిపించబోతున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బీజేపీలో సీనియర్ నాయకుడు. ఆయన ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలని బాబు స్కెచ్ గీసినట్టు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నానిని రాయబారానికి పంపించారని తెలుస్తోంది. కేశినేని నాని తాజాగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడితో భేటి కావడం.. సుమారు అరగంటకు పైగా వారిద్దరి మధ్య చర్చలు సాగడం అనేక ఊహాగానాలకు తెరతీసింది. ఈ సమావేశంలోనే కేశినేని ఫోన్ ద్వారా చంద్రబాబుతో వెంకయ్యనాయుడు ను మాట్లాడించారని తెలిసింది.

2014లో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కుదరడానికి, సీట్ల సర్దుబాటు సహా అధికారంలోకి రావడానికి వెంకయ్య దోహదపడ్డారు. వెంకయ్య కేంద్రంలో మంత్రిగా ఉన్నంత కాలం టీడీపీకి గానీ చంద్రబాబుకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఉపరాష్ట్రపతిగా పోయాకే చంద్రబాబుకు కష్టాలు వచ్చాయి. మోడీతో విభేదించి బయటకు వచ్చాడు. కాంగ్రెస్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు.

అందుకే ఈ దారుణ పరాజయం వేళ చంద్రబాబు మళ్లీ వెంకయ్యనాయుడితో బీజేపీకి రాయబారం పంపాలని డిసైడ్ అయినట్టు సమాచారం. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ప్రస్తుతం బీజేపీ తో తప్ప మరో పార్టీతో కలవలేని పరిస్థితిని బాబు ఎదుర్కొంటున్నారు.

First Published:  30 May 2019 5:32 AM IST
Next Story