Telugu Global
National

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రమాణం చేసిన మంత్రులు వీళ్లే

దేశ ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ప్రధానితో పాటు 24 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర మంత్రులు, 24 మంది సహాయ […]

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రమాణం చేసిన మంత్రులు వీళ్లే
X

దేశ ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు.

ప్రధానితో పాటు 24 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు ప్రమాణం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కేబినెట్‌లో చోటు దొరకగా.. మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు కూడా మంత్రి పదవి వరించింది. ఇక సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ సింగ్ ఠాకూర్‌కి కూడా సహాయ మంత్రి పదవి దక్కింది.

కేబినెట్ మంత్రులు

  • రాజ్‌నాథ్ సింగ్(ఉత్తరప్రదేశ్),
    అమిత్ షా (గుజరాత్),
    నితిన్ గడ్కరి (మహారాష్ట్ర),
    డీవీ సదానంద గౌడ (కర్ణాటక),
    నిర్మలా సీతారామన్ (రాజ్యసభ),
    రాంవిలాస్ పాశ్వాన్ (బీహార్) ,
    నరేంద్ర సింగ్ తోమర్ (మధ్యప్రదేశ్),
    రవిశంకర్ ప్రసాద్(రాజ్యసభ),
    హర్సిమత్ సింగ్ బాదల్ (పంజాబ్),
    థావర్ చంద్ గెహ్లోట్ (రాజ్యసభ),
    సుబ్రహ్మణ్యం జయశంకర్ (మాజీ విదేశాంగ కార్యదర్శి),
    రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ (ఉత్తరాఖండ్),
    అర్జున్ ముండా (జార్ఖండ్),
    స్మృతీ ఇరానీ (ఉత్తర్ ప్రదేశ్),
    హర్షవర్థన్ (ఢిల్లీ),
    ప్రకాశ్ జావేద్కర్ (రాజ్యసభ),
    పీయుష్ గోయెల్ (రాజ్యసభ)
    ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిషా)
    ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (ఉత్తర్‌ప్రదేశ్)
    ప్రహ్లాద్ జోషి (కర్ణాటక)
    మహేంద్రనాథ్ పాండే (ఉత్తర్‌ప్రదేశ్)
    అరవింద్ గణపత్ సావంత్ (మహారాష్ట్ర)
    గిరిరాజ్ సింగ్ (బీహార్)
    గజేంద్ర సింగ్ షెకావత్ (రాజస్థాన్)

సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ చార్జ్)

  • సంతోష్ కుమార్ గంగ్‌వార్ (ఉత్తర్‌ప్రదేశ్)
    రావ్ ఇంద్రజీత్ సింగ్ (హర్యాణా)
    శ్రీపాద యశో నాయక్ (గోవా)
    జితేంద్ర్ సింగ్ (జమ్ము కశ్మీర్)
    కిరణ్ రిజిజు (అరుణాచల్ ప్రదేశ్)
    ప్రహ్లాద్ సింగ్ పటేల్ (మధ్యప్రదేశ్)
    రాజ్‌కుమార్ సింగ్ (రాజ్యసభ)
    హర్థీప్ సింగ్ పూరి (రాజ్యసభ)
    మన్సుఖ్ లక్ష్మణ్ భాయ్ మండవియా (రాజ్యసభ)

సహాయ మంత్రులు

  • ఫగ్గన్ సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)
    అశ్వనీ కుమార్ చౌబే (బీహార్)
    అర్జున్ రామ్ మేఘ్‌వాల్ (రాజస్థాన్)
    జనరల్ వీకే సింగ్ (ఉత్తర్ ప్రదేశ్)
    కృష్ణపాల్ గుజార్ (హర్యాణా)
    రావ్ సాహెబ్ దాదారావ్ పాటిల్ దాన్వే (మహారాష్ట్ర)
    జి. కిషన్ రెడ్డి (తెలంగాణ)
    పురుషోత్తం రూపాలా (గుజారాత్)
    రామ్‌దాస్ అథవాలే (రాజ్యసభ)
    సాధ్వి నిరంజన్ జ్యోతి (ఉత్తర్‌ప్రదేశ్)
    బాబుల్ సుప్రియో (పశ్చిమ బెంగాల్)
    సంజీవ్ కుమార్ బాలియాన్ (ఉత్తర్ ప్రదేశ్)
    సంజయ్ శ్యామ్‌రావ్ థోత్రే (మహారాష్ట్ర)
    అనురాగ్ సింగ్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్)
    సురేష్ అంగథీ (కర్ణాటక)
    నిత్యానంద్ రాయ్ (బీహార్)
    రతన్ లాల్ కటారియా (హర్యాణా)
    వి. మురళీధరన్ (రాజ్యసభ)
    రేణుకా సింగ్ సరూతా (చత్తీస్‌గడ్)
    సోమ్ ప్రకాశ్ (పంజాబ్)
    రామేశ్వర్ తేలి (అస్సామ్)
    ప్రతాప్ చంద్ర సారంగి (ఒడిషా)
    కైలాష్ చౌదరి (రాజస్థాన్)
    దేబశ్రీ చౌదరి (పశ్చిమ బెంగాల్)
First Published:  30 May 2019 4:02 PM IST
Next Story