Telugu Global
National

నేను మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను : జీ. కిషన్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పూర్తి మెజార్టీ సాధించడంతో మోడీ మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానితో పాటు మరి కొంత మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచి దాదాపు 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ […]

నేను మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను : జీ. కిషన్ రెడ్డి
X

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పూర్తి మెజార్టీ సాధించడంతో మోడీ మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానితో పాటు మరి కొంత మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచి దాదాపు 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. కాని ఆరు నెలల్లోనే అనూహ్యంగా పుంజుకొని నాలుగు పార్లమెంటు స్థానాలు తమ ఖాతాలో వేసుకుంది. ఇందులో కల్వకుంట్ల కవితను ఓడించి నిజామాబాద్ నుంచి కూడా బీజేపీ గెలవడం విశేషం. ఇక సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, అదిలాబాద్ నుంచి సోయం బాబూరావు గెలిచారు.

దక్షిణాదిలో బీజేపీకి తక్కువ స్థానాలే వచ్చాయి. గతంలో ఒకే ఒక పార్లమెంటు సీటు తెలంగాణలో గెలుచుకుంది. కానీ ఈ సారి నాలుగుకు పెంచుకుంది. వీరిలో సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకుడు. అసెంబ్లీలో పార్టీ శాసన సభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. అంతే కాకుండా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ ఆలోచించినట్లు తెలుస్తోంది. దీంతో కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అయ్యింది.

తనకు మంత్రి పదవి వచ్చినట్లు స్వయంగా కిషన్ రెడ్డే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రధాని మోడీ, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో ఇవాళ సాయంత్రం తాను కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు ట్విట్ చేశారు. కిషన్ రెడ్డికి పదవి వరించడంతో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి.

First Published:  30 May 2019 12:17 PM IST
Next Story