Telugu Global
NEWS

ప్రపంచకప్ సన్నాహకమ్యాచ్ లో భారత్ టాప్ గేర్

ధూమ్ ధామ్ సెంచరీలతో రాహుల్- ధోనీ జోరు బంగ్లాదేశ్ ను 95 పరుగులతో చిత్తు చేసిన విరాట్ సేన న్యూజిలాండ్ పై విండీస్ 421 పరుగుల స్కోరు వన్డే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ ల రౌండ్ ను హాట్ ఫేవరెట్ భారత్ భారీవిజయంతో ముగించింది. రెండో డౌన్ రాహుల్, మిడిలార్డర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ…స్ట్రోక్ ఫుల్ సెంచరీలు సాధించడంతో భారత్ 95 పరుగులతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. విరాట్ సేన టాప్ గేర్… ప్రపంచకప్ రెండో ర్యాంకర్ […]

ప్రపంచకప్ సన్నాహకమ్యాచ్ లో భారత్ టాప్ గేర్
X
  • ధూమ్ ధామ్ సెంచరీలతో రాహుల్- ధోనీ జోరు
  • బంగ్లాదేశ్ ను 95 పరుగులతో చిత్తు చేసిన విరాట్ సేన
  • న్యూజిలాండ్ పై విండీస్ 421 పరుగుల స్కోరు

వన్డే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ ల రౌండ్ ను హాట్ ఫేవరెట్ భారత్ భారీవిజయంతో ముగించింది. రెండో డౌన్ రాహుల్, మిడిలార్డర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ…స్ట్రోక్ ఫుల్ సెంచరీలు సాధించడంతో భారత్ 95 పరుగులతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

విరాట్ సేన టాప్ గేర్…

ప్రపంచకప్ రెండో ర్యాంకర్ భారత్…సన్నాహక తొలిమ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి వెంటనే తేరుకొంది. కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో సన్నాహక మ్యాచ్ లో… ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకన్న బంగ్లాదేశ్ కోరి కష్టాలు కొనితెచ్చుకొంది. బ్యాటింగ్ కు దిగిన భారత్… ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మ…ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కొహ్లీ వికెట్లు నష్టపోయింది.

ధావన్ 1, రోహిత్ 19, కెప్టెన్ కొహ్లీ 47 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.

రాహుల్- ధోనీ వీరవిహారం…

టాపార్డర్ లో నాలుగు వికెట్లు నష్టపోయిన సమయంలో జత కలిసిన రెండో డౌన్ రాహుల్, మిడిలార్డర్ ఆటగాడు ధోనీ 5వ వికెట్ కు 164 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

రాహుల్ 99 బాల్స్ లో 12 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 108 పరుగులు, వెటరన్ ధోనీ 78 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 113 పరుగులతో చెలరేగిపోయారు.

బంగ్లాకు భారత స్పిన్ జోడీ బ్రేక్..

360 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు భారత ఓపెనింగ్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమార్, స్పిన్ జోడీ చాహల్, కుల్దీప్ యాదవ్ చెక్ చెప్పారు.

ఓపెనర్ లిట్టన్ దాస్ 73, రెండోడౌన్ ఆటగాడు ముష్ ఫికుర్ రహీం 90 పరుగులు మినహా మిగిలిన ఆటగాళ్లతో విఫలమయ్యారు.
బంగ్లాజట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటయ్యింది.

భారత బౌలర్లలో చాహల్, కుల్దీప్ చెరో మూడు వికెట్లు, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. దీంతో 95 పరుగుల విజయంతో సన్నాహక మ్యాచ్ లను ముగించిన భారత్…ప్రపంచకప్ లో తన ప్రారంభ మ్యాచ్ లో జూన్ 5న సౌతాఫ్రికాతో తలపడనుంది.

వెస్టిండీస్ భారీవిజయం…

బ్రిస్టల్ వేదికగా జరిగిన మరో సన్నాహక మ్యాచ్ లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ 91 పరుగులతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు 49.2 ఓవర్లలో 421 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యింది.
ఓపెనర్లు గేల్ 36,లూయిస్ 50, వన్ డౌన్ హోప్ 101, మిడిలార్డర్ ఆటగాళ్లు జేసన్ హోల్డర్ 47, రసెల్ 54 పరుగులు సాధించారు.

న్యూజిలాండ్ 330 ఆలౌట్…

422 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 47. 2 ఓవర్లలో 330 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ 85 పరుగులు, మిడిలార్డర్ ఆటగాడు బ్లుండెల్ 106, ఆల్ రౌండర్ ఇష్ సోధీ 36 పరుగులు మాత్రమే చేయగలిగారు.

విండీస్ బౌలర్లలో బ్రాత్ వెయిట్ 3, అలెన్ 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ జట్టు మే 31న జరిగే తన ప్రారంభరౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడాల్సి ఉంది.

First Published:  29 May 2019 7:45 PM GMT
Next Story