Telugu Global
NEWS

లోకేష్‌ పై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం..!

“తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని సీనియర్ నాయకులు, కార్యకర్తలు మోసం చేశారు. వారివల్లే ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది” ఇవి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా పెదవి విప్పిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై సీరియస్ గా స్పందించారు. గుంటూరులో లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలవగా లేనిది మిగిలిన వారు ఎందుకు విజయం సాధించలేకపోయారు అంటూ ప్రశ్నించారు. నారా లోకేష్ సంధించిన […]

లోకేష్‌ పై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం..!
X

“తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని సీనియర్ నాయకులు, కార్యకర్తలు మోసం చేశారు. వారివల్లే ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది” ఇవి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా పెదవి విప్పిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై సీరియస్ గా స్పందించారు.

గుంటూరులో లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలవగా లేనిది మిగిలిన వారు ఎందుకు విజయం సాధించలేకపోయారు అంటూ ప్రశ్నించారు. నారా లోకేష్ సంధించిన ఈ ప్రశ్నలు, ఓటమి తర్వాత చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. ఆ ప్రశ్న ఇతరులను అడిగేముందు గల్లా జయదేవ్‌ గెలిచినప్పుడు ఆయనెందుకు ఓడిపోయాడో చెప్పాలని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

మూడున్నర దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని మండిపడుతున్నారు. కనీస రాజకీయ అనుభవం కూడా లేని నారా లోకేష్ తన తండ్రిని అడ్డం పెట్టుకుని మంత్రి అయ్యారని, పార్టీ కోసం కార్యకర్తలు ఎలా కష్టపడతారో ఆయనకు ఎలా తెలుస్తుంది అని మండిపడుతున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న కార్యకర్తలు వేలాది మంది ఉన్నారని, గెలుపోటములు రెండింటిలోనూ వారికి ఎంతో ప్రాధాన్యత ఉందని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తలను, నాయకులను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, పార్టీ విజయం సాధిస్తే అది తమ వల్ల, ఓటమి పాలైతే కార్యకర్తల వల్ల అనడం భవిష్యత్తులో పార్టీకి మరింత చేటు చేస్తుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

పార్టీని నడిపించాల్సిన లోకేష్ ఇప్పటినుంచే ఇలా వ్యాఖ్యానించడం, సీనియర్ నాయకులపై ప్రశ్నలు సంధించడం సరైనది కాదని అంటున్నారు. నారా లోకేష్ చుట్టూ ఉన్న కోటరీతో సహా కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఓటమికి తమని బాధ్యుల్ని చేయడం సరి కాదని అంటున్నారు. కష్ట సమయంలో కార్యకర్తలకు అండగా ఉండాల్సింది పోయి వారిని అవమానించేలా మాట్లాడడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అంటున్నారు.

First Published:  29 May 2019 1:30 AM IST
Next Story