ఎన్టీఆర్ పేరుతో కొత్త జిల్లా?
నిన్న ఎన్టీఆర్ జయంతి. టీడీపీ నాయకులందరూ ఆయనకు ఘననివాళులు అర్పించారు. అయితే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి… ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం ఉండే మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి ఆ జిల్లాకు ఎన్టీరామారావు పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జగన్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చబోతున్నారు. ఆ […]
నిన్న ఎన్టీఆర్ జయంతి. టీడీపీ నాయకులందరూ ఆయనకు ఘననివాళులు అర్పించారు.
అయితే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి… ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం ఉండే మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి ఆ జిల్లాకు ఎన్టీరామారావు పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
జగన్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తానని ప్రకటించారు.
ఇప్పుడు ఆ హామీని నెరవేర్చబోతున్నారు. ఆ హామీ ప్రకారం ఇక ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు రాబోతున్నాయి. వీటిలో పార్వతీపురం నియోజకవర్గాన్ని గిరిజన జిల్లాగా ప్రకటించే అవకాశం ఉంది.