చింత చచ్చినా.... చింతమనేని ఆగడం లేదుగా....
చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా… చింతమనేని ఓడిపోయినా కూడా ఆయన ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఓడినా కూడా ఇంకా తనే ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నాడు. నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ విషయంలో దూకుడుగా వెళ్లి లొల్లి చేసిన చింతమనేనికి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ నేతల ప్రతిఘటనతో చింతమనేనికి చెక్ పడ్డ సంఘటన తాజాగా చోటు చేసుకుంది. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. చింతమనేని లాంటి […]
చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా… చింతమనేని ఓడిపోయినా కూడా ఆయన ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఓడినా కూడా ఇంకా తనే ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నాడు. నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ విషయంలో దూకుడుగా వెళ్లి లొల్లి చేసిన చింతమనేనికి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ నేతల ప్రతిఘటనతో చింతమనేనికి చెక్ పడ్డ సంఘటన తాజాగా చోటు చేసుకుంది.
చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. చింతమనేని లాంటి వాళ్లు దళితులపై నోరుపారేసుకోవడంతో పెద్ద దుమారమే రేగింది.. అదీ కాక క్రిస్టియన్ మతం తీసుకున్న దళితులపై కూడా చింతమనేని అనుచరులు దాడులకు దిగడం వివాదాస్పదమైంది.
అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై దాడులతో చింతమనేని అనుచరులు వార్తల్లో నిలిచారు. కానీ చింతమనేని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ నేత అబ్బాయి చౌదరి ఘనవిజయం సాధించారు.
తాజాగా ఇంకా తమ పార్టీ అధికారంలో ఉన్నట్టు చింతమనేని చెలరేగిపోయాడు. మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగాడు. దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంగళవారం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈనేపథ్యంలో దుగ్గిరాలలో సరైన అనుమతులు తీసుకోకుండా మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటుకు యత్నించారు. రాత్రి జరిగిన ఈ ఘటనతో దుగ్గిరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దుగ్గిరాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెదవేగి తహసీల్దార్ ఆఫీసుకు పోలీసులు తరలించారు.
ఇలా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేనికి సహకరించిన పోలీసులు…. ఇప్పుడు మాత్రం చింతమనేనికి చెక్ పెట్టారు.