Telugu Global
Cinema & Entertainment

తమిళంలోకి కేరాఫ్ కంచరపాలెం

గతేడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది కేరాఫ్ కంచరపాలెం. ఈ సినిమా కంటెంట్ నచ్చి స్వయంగా దగ్గుబాటి రానా దీన్ని కొనుక్కున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేశాడు. అలా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కేరాఫ్ కంచరపాలెం సినిమా ఇప్పుడు రీమేక్ కాబోతోంది. సురేష్ బాబు వద్ద నుంచి ఈ సినిమా రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నాడు నిర్మాత రాజశేఖర్ రెడ్డి. గతంలో త్రిపుర లాంటి సినిమాను నిర్మించిన ఈ […]

తమిళంలోకి కేరాఫ్ కంచరపాలెం
X

గతేడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది కేరాఫ్ కంచరపాలెం. ఈ సినిమా కంటెంట్ నచ్చి స్వయంగా దగ్గుబాటి రానా దీన్ని కొనుక్కున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేశాడు.

అలా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కేరాఫ్ కంచరపాలెం సినిమా ఇప్పుడు రీమేక్ కాబోతోంది. సురేష్ బాబు వద్ద నుంచి ఈ సినిమా రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నాడు నిర్మాత రాజశేఖర్ రెడ్డి. గతంలో త్రిపుర లాంటి సినిమాను నిర్మించిన ఈ ప్రొడ్యూసర్.. కేరాఫ్ కంచరపాలెం సినిమాకు సంబంధించి తమిళ్ తో పాటు మలయాళం రీమేక్ రైట్స్ కూడా దక్కించుకున్నాడు.

రీమేక్ రైట్స్ దక్కించుకున్నప్పట్నుంచి ఇప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశారట. త్వరలోనే సినిమాను తమిళ్ లో ప్రారంభిస్తారట. తెలుగులో తీసినట్టుగానే తమిళ్ లో కూడా నూతన నటీనటులతో ఈ సినిమాను నిర్మిస్తారట. కాకపోతే ముందుగా తమిళ్ లో రీమేక్ చేసి, తర్వాత మలయాళంలో రీమేక్ చేస్తారట.

తెలుగులో ఈ సినిమాను జస్ట్ 70 లక్షల రూపాయల్లో పూర్తిచేశారు. అంతా కొత్త వాళ్లు కావడం, ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో సురేష్ బాబును సంప్రదించారు. సురేష్ బాబు ఈ సినిమాను అటుఇటుగా కోటి రూపాయలకు దక్కించుకున్నారు. 2 కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ చేశారు. ఈ సినిమా కంటెంట్ టీవీకి పెద్దగా వర్కవుట్ అవ్వదు. అందుకే శాటిలైట్ రైట్స్ మాత్రం అమ్మలేకపోయారు. మొన్నటివరకు వెయిట్ చేసి, చివరికి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

First Published:  29 May 2019 12:32 AM IST
Next Story