ప్రపంచకప్ లో నేడు భారత్ రెండో సన్నాహక మ్యాచ్
కార్డిఫ్ వేదిగా బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ సమరం జూన్ 5న సౌతాఫ్రికాతో భారత్ పోటీ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఓడిన భారత్ వన్డే ప్రపంచకప్ లో అసలుసిసలు సమరానికి సన్నాహకంగా జరిగే ప్రాక్టీసు మ్యాచ్ కు మాజీ చాంపియన్ భారత్, బంగ్లాదేశ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా మంగళవారం జరిగే ఈమ్యాచ్ లో నెగ్గితీరాలన్న పట్టుదలతో రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి. మే 30నుంచి ప్రారంభంకానున్న ఆరువారాల […]
- కార్డిఫ్ వేదిగా బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ సమరం
- జూన్ 5న సౌతాఫ్రికాతో భారత్ పోటీ
- తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఓడిన భారత్
వన్డే ప్రపంచకప్ లో అసలుసిసలు సమరానికి సన్నాహకంగా జరిగే ప్రాక్టీసు మ్యాచ్ కు మాజీ చాంపియన్ భారత్, బంగ్లాదేశ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.
కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా మంగళవారం జరిగే ఈమ్యాచ్ లో నెగ్గితీరాలన్న పట్టుదలతో రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి.
మే 30నుంచి ప్రారంభంకానున్న ఆరువారాల ఈ టోర్నీ కోసం…వివిధ జట్లు సన్నాహక మ్యాచ్ ల్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా.. న్యూజిలాండ్ తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్ లో 6 వికెట్ల పరాజయం పొందిన భారతజట్టు…రెండో సన్నాహకమ్యాచ్ ను విజయంతో ముగించాలన్న పట్టుదలతో ఉంది.
న్యూజిలాండ్ తో ముగిసిన మ్యాచ్ లో భారత టాపార్డర్ పేకమేడలా కూలిపోడం…టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురిచేసింది.
దీంతో …తొలిమ్యాచ్ లో చోటు చేసుకొన్న లోపాలను సవరించుకోడానికి..బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ ను ఉపయోగించుకోవాలని
భావిస్తోంది.
ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్…
ముష్రఫే మొర్తాజా నాయకత్వంలోని బంగ్లాదేశ్ జట్టు…ఇటీవలే ముగిసిన మూడుదేశాల వన్డే సిరీస్ లో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లను చిత్తు చేయడం ద్వారా విజేతగా నిలిచింది.
అదేజోరును…పవర్ ఫుల్ భారత్ తో జరిగే సన్నాహక మ్యాచ్ లో సైతం కొనసాగించాలన్న లక్ష్యంతో ఉంది.
పరుగుల గని సోఫియా గార్డెన్స్…
వేల్స్ లోని కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ వికెట్ కు పరుగుల గనిగా పేరుంది. భారీస్కోరింగ్ మ్యాచ్ నమోదయ్యే అవకాశం లేకపోలేదు.
350కి పైగా స్కోరు సాధించినా…ఇక్కడి పిచ్ పైన చేజింగ్ కు అవకాశం ఉంటుంది.
అయితే…వాతావరణం మేఘావృతమైతే మాత్రం…రెండుజట్ల స్వింగ్,పేస్ బౌలర్లు చెలరేగిపోడం, మ్యాచ్ విన్నర్లుగా నిలవడం
ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భారీస్కోరుకు భారత్ గురి…
భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ, రెండో డౌన్ రాహుల్…భారీస్కోర్లు సాధించడమే లక్ష్యంగా మ్యాచ్ కు సిద్ధమయ్యారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో చోటు చేసుకొన్న లోపాలను ఈ మ్యాచ్ లో పునరావృతం కానివ్వరాదన్న లక్ష్యంతో ఉన్నారు.
మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ సమరంలో భాగంగా భారత్ తన తొలిమ్యాచ్ ను…జూన్ 5న సౌతాఫ్రికాతో ఆడనుంది.