టీడీపీ ఓటమితో.... ఎన్టీఆర్ ను మరిచారు....
ఎన్టీఆర్…. తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన నేత. ఎన్నో విప్లవాత్మక మార్పులు, సంచలన సంక్షేమ పథకాలతో తెలుగువారి మదిలో గొప్ప కథనాయకుడిగానే కాదు.. గొప్ప రాజకీయ నేతగా ఎదిగారు. అంతటి మహానాయకుడి జయంతి నేడు కళతప్పింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడును ఈసారీ టీడీపీ వదిలేసింది. ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టీడీపీ మహానాడు వేడుకను వదిలేసింది. చంద్రబాబు ఈ ఓటమితో బయటకు రావడమే మానేశాడు. కనీసం నివాళులు అర్పించేందుకు వస్తాడో రాడో […]
ఎన్టీఆర్…. తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన నేత. ఎన్నో విప్లవాత్మక మార్పులు, సంచలన సంక్షేమ పథకాలతో తెలుగువారి మదిలో గొప్ప కథనాయకుడిగానే కాదు.. గొప్ప రాజకీయ నేతగా ఎదిగారు. అంతటి మహానాయకుడి జయంతి నేడు కళతప్పింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడును ఈసారీ టీడీపీ వదిలేసింది.
ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టీడీపీ మహానాడు వేడుకను వదిలేసింది. చంద్రబాబు ఈ ఓటమితో బయటకు రావడమే మానేశాడు. కనీసం నివాళులు అర్పించేందుకు వస్తాడో రాడో కూడా తెలియదు. ఏపీలో ఎమ్మెల్యేలు కూడా పట్టుమని 23 మందే గెలవడంతో వారు కూడా ఎన్టీఆర్ జయంతిని చేసుకునే వీలు లేకుండా పోయింది.
ఇక చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడి జయంతిని వదిలేసినా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు. ఈ ఉదయం 5.30 గంటలకు అభిమానుల తాకిడి తక్కువగా ఉండే వేళ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. అక్కడ ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనంతరం ధ్యానముద్రలో అక్కడే కాసేపు కూర్చొని జూనియర్ ఎన్టీఆర్ తాతను తలుచుకున్నారు.
టీడీపీ ఘోర ఓటమి.. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టీడీపీని లీడ్ చేయాలని అభిమానులు నినాదాలు చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం వారికి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం విశేషం.