Telugu Global
Cinema & Entertainment

సాహోపై క్లారిటీ ఇచ్చిన శంకర్ మహదేవన్

సడెన్ గా సాహో నుంచి సంగీత దర్శకులు తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అటు సంగీత దర్శకులు శంకర్-ఎహశాన్-లాయ్.. ఇటు నిర్మాతలు ప్రమోద్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఎందుకిలా జరిగిందనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేదు. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ పై శంకర్-ఎహసాన్-లాయ్ త్రయంలో ఒకరైన శంకర్ మహదేవన్ స్పందించారు. సాహో సినిమాకు పూర్తిగా సంగీతం అందించే బాధ్యతను వీళ్లకు […]

సాహోపై క్లారిటీ ఇచ్చిన శంకర్ మహదేవన్
X

సడెన్ గా సాహో నుంచి సంగీత దర్శకులు తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అటు సంగీత దర్శకులు శంకర్-ఎహశాన్-లాయ్.. ఇటు నిర్మాతలు ప్రమోద్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఎందుకిలా జరిగిందనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేదు. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ పై శంకర్-ఎహసాన్-లాయ్ త్రయంలో ఒకరైన శంకర్ మహదేవన్ స్పందించారు.

సాహో సినిమాకు పూర్తిగా సంగీతం అందించే బాధ్యతను వీళ్లకు అప్పగించలేదట. కొన్ని పోర్షన్లు మాత్రమే కంపోజ్ చేయాలని నిర్మాతలు కోరారట. అందుకు తగ్గట్టే షేడ్స్ ఆఫ్ సాహో అంటూ విడుదల చేస్తున్న వీడియోల కోసం తమన్ ను తీసుకున్నారు. ఇక్కడివరకు ఈ మ్యూజిక్ డైరక్టర్లకు ఓకే. అయితే ఇప్పుడు పాటల్లో కూడా వేరే సంగీత దర్శకుల్ని చొప్పించడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.

ఉన్న 5 పాటల్లో కొన్ని పాటల్ని వేరే కంపోజర్స్ కు ఇవ్వాలని అనుకున్నారు నిర్మాతలు. అప్పుడు శంకర్-ఎహశాన్-లాయ్ చేసిన పని మరింతగా తగ్గిపోతుంది. దీంతో ప్రాజెక్టు నుంచి సున్నితంగానే తప్పుకున్నట్టు ప్రకటించారు శంకర్ మహదేవన్.

సాహోకు సంబంధించి కనీసం పాటలన్నీ కంపోజ్ చేసే బాధ్యతైనా తమకు ఇస్తారని భావించామని, అది కూడా జరగకపోవడంతో తప్పుకున్నామని తెలిపాడు. శంకర్ మహదేవన్ చెప్పిన మేటర్ పై సాహో నిర్మాతలు ఇంకా స్పందించలేదు.

First Published:  28 May 2019 6:01 PM IST
Next Story