ఏపీ నుంచి రవి ప్రకాష్ పరార్?
టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎక్కడ ఉన్నాడు? ఇన్నాళ్లు ఏపీలో షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. చంద్రబాబు వస్తే ఏదో ఒకటి చేసి అక్కడ ఉందామని అనుకున్నారు. కానీ జగన్ రావడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రవిప్రకాష్ ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రవిప్రకాష్ కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 […]
టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎక్కడ ఉన్నాడు? ఇన్నాళ్లు ఏపీలో షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. చంద్రబాబు వస్తే ఏదో ఒకటి చేసి అక్కడ ఉందామని అనుకున్నారు. కానీ జగన్ రావడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రవిప్రకాష్ ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రవిప్రకాష్ కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు.
రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ 160, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
బెంగళూరు, విజయవాడలతోపాటు ముంబై, గుజరాత్‌లోనూ రవిప్రకాశ్ తలదాచుకునే అవకాశాలు ఉండటంతో రెండు టీంలు అక్కడా వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిప్రకాశ్ తన ఆచూకీ చిక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా దాదాపు 30 వరకు సిమ్‌కార్డులు మార్చాడని సమాచారం.
సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మాత్రం సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రవిప్రకాష్ హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకున్నట్లు మరో సమాచారం. పాతబస్తీ కీలక నేత అండతో ఆయన అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ద్వారానే రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన మాజీ అనుచరులు చెబుతున్నారు.