Telugu Global
Cinema & Entertainment

కె.జి.యఫ్.... ఇందిరా గాంధీ పాత్రకోసం బాలీవుడ్ నటి

కె.జి.యఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషించిన యష్ కి మాత్రం దేశ వ్యాప్తం గా క్రేజ్ వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా అందరినీ ఎంత గానో మెప్పించింది. అయితే మొదటి భాగమే పెద్ద విజయం సాధించడం తో ఈ సినిమా రెండో భాగం పైన ఎనలేని అంచనాలు వచ్చి పడ్డాయి దర్శక నిర్మాతలకి. […]

కె.జి.యఫ్.... ఇందిరా గాంధీ పాత్రకోసం బాలీవుడ్ నటి
X

కె.జి.యఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషించిన యష్ కి మాత్రం దేశ వ్యాప్తం గా క్రేజ్ వచ్చింది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా అందరినీ ఎంత గానో మెప్పించింది. అయితే మొదటి భాగమే పెద్ద విజయం సాధించడం తో ఈ సినిమా రెండో భాగం పైన ఎనలేని అంచనాలు వచ్చి పడ్డాయి దర్శక నిర్మాతలకి.

అందుకే ఈ రెండో భాగాన్ని చాలా జాగ్రత్తగా తీయడమే కాకుండా… హిందీ లో పాపులర్ అయిన నటుల్ని కూడా సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.

తాజా సమాచారం మేరకు సినిమా కథ లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని చెప్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు ఆ పాత్ర కి బాలీవుడ్ అందాల నటి రవీనా టండన్ ని ఎంపిక చేసుకున్నారు దర్శక నిర్మాతలు.

రవీనా టండన్ ఈ సినిమా కథ వినగానే ఈ పాత్ర ని చేయడానికి ఒప్పుకుంది. కాకపోతే రానున్న రోజుల్లో ఈ విషయమై ఏమైనా వివాదం అవుతుందా? అనే విషయం మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఆసక్తి రేపుతోంది. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ లో రవీనా పాల్గొననుంది.

First Published:  28 May 2019 10:01 AM IST
Next Story