Telugu Global
NEWS

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్: పురంధ్రీశ్వరి

“ నందమూరి తారకరామారావు మహోన్నత వ్యక్తి. ఆయనకు కూతురుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం” అని కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆమె, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, మనుమలు పాల్గొన్నారు. నివాళులర్పించిన అనంతరం దగ్గుబాటి పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం అని, […]

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్: పురంధ్రీశ్వరి
X

“ నందమూరి తారకరామారావు మహోన్నత వ్యక్తి. ఆయనకు కూతురుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం” అని కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆమె, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, మనుమలు పాల్గొన్నారు. నివాళులర్పించిన అనంతరం దగ్గుబాటి పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం అని, ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు పదే పదే చెప్పేవారని, తన సంతానానికి కూడా అదే బోధించేవారు అని అన్నారు.

తాత జీవించి ఉన్నంత వరకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని ఆయన మనవరాలు, హరికృష్ణ కుమార్తె సుహాసిని పేర్కొన్నారు.

తన తండ్రి ఎన్టీరామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సినీ నటులు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న ఘన నివాళులు అర్పించారు.
జూనియర్‌ ఎన్టీఆర్…. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చినప్పుడు…. తెలుగుదేశం పార్టీని మీరే నడిపించాలి అంటూ అభిమానులు నినాదాలు చేశారు.

నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు తగిన శాస్తి చెప్పారన్నారు. లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. లక్ష్మీ పార్వతి విలేకరులతో మాట్లాడకుండా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంటూరులోని తెలుగు దేశం పార్టీ ఆఫీసులో సమావేశమై ఆయనకు ఘన నివాళులు అర్పించనున్నారు.

First Published:  28 May 2019 4:46 AM IST
Next Story